జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్ | Manmadhudu 2 Trailer is All Set to Launch on July 25th | Sakshi
Sakshi News home page

జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

Published Sun, Jul 21 2019 4:09 PM | Last Updated on Sun, Jul 21 2019 4:09 PM

Manmadhudu 2 Trailer is All Set to Launch on July 25th - Sakshi

నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటిస్తోన్న తాజా చిత్రం ‘మ‌న్మథుడు 2’. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్రన్ ద‌ర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్తయ్యింది.

ప్రస్తుతం డ‌బ్బింగ్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌, అవంతిక స్పెషల్ టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 25న ఈ సినిమా థియట్రికల్‌ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగ‌స్ట్ 9న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement