తెలంగాణ చిత్రసీమలో చాలా అద్భుతాలు జరుగుతాయి | Many miracles occurs in telangana film industry | Sakshi
Sakshi News home page

తెలంగాణ చిత్రసీమలో చాలా అద్భుతాలు జరుగుతాయి

Published Thu, Jul 3 2014 12:12 AM | Last Updated on Thu, Mar 28 2019 5:30 PM

తెలంగాణ చిత్రసీమలో  చాలా అద్భుతాలు జరుగుతాయి - Sakshi

తెలంగాణ చిత్రసీమలో చాలా అద్భుతాలు జరుగుతాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది. అన్ని సంస్థలూ శాఖల్లోనూ ఈ విభజన కనబడుతోంది. మరి తెలుగు చిత్రసీమ భవిష్యత్తు ఏమిటి? తెలుగు సినిమా నుంచి తెలంగాణ సినిమా విడిపోనుందా? ఈ విషయమై ఏవేవో అపోహలు, రకరకాల ఊహాగానాలు. ‘కొమరం భీమ్’ లాంటి చిత్రాలు డెరైక్ట్ చేసి, ప్రస్తుతం తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతోన్న అల్లాణి శ్రీధర్ ఈ విషయాలపై కొంచెం క్లారిటీ నిచ్చారు.
 
ఎందుకు విడిపోవాలంటే?
రాష్ట్రమే విడిపోయాక, సినిమా పరిశ్రమ కలిసి ఉండాలనడం కరెక్ట్ కాదు. ఇన్నేళ్లు అనేక రకాలుగా తెలంగాణ కళాకారులు వివక్ష నెదుర్కొన్నారు. ఇతివృత్తాల పరంగా కూడా తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది. మా భాషనీ, యాసనీ, జీవన విధానాన్నీ, సంస్కృతిని కూడా హేళనగా చూస్తున్నారు. పరిశ్రమ కొన్ని కుటుంబాలకే పరిమితమై పోయింది. బి. నరసింగరావులాంటి ప్రముఖులకు వజ్రోత్సవాలు, వందేళ్ల వేడుకల సమయంలో కనీస ఆహ్వానం కూడా లేదు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి.

ఎలా విడిపోతామంటే?
ఇన్నాళ్లూ ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 23 జిల్లాలు ఉన్నాయి. ఇకపై సీమాంధ్రలోని 10 జిల్లాలకు సంబంధించి తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ పని చేస్తుంది. ఇలా 24 శాఖల్లోనూ విభజన ఉంటుంది. దీనివల్ల ఎవ్వరూ నష్టపోవడం ఉండదు. సంస్థల పరంగా విడిపోయినా, అందరం హాయిగా కలిసి పని చేసుకోవచ్చు. భవిష్యత్తులో తెలంగాణ చిత్రసీమలో చాలా అద్భుతాలు జరుగుతాయి.

ఎప్పుడు విడిపోతామంటే?
బి. నరసింగరావు నేతృత్వంలో మరో రెండు వారాల్లో మేమంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలవబోతున్నాం. ఇక్కడున్న సినిమా వనరులు గురించి, కళాకారుల గురించి పూర్తి స్తాయి సమాచారాన్ని సీఎమ్‌కు ఓ నివేదిక రూపంలో ఇవ్వబోతున్నాం. ఇన్నాళ్లూ అన్నదమ్ముల్లా ఒకే ఇంట్లో ఉన్నాం. మా వాటాకు చాలా రిపేర్లు ఉన్నాయి. దాన్ని బాగు చేసుకునేకన్నా చిన్నదైనా సరే కొత్త ఇల్లు కట్టుకుందామన్నది మా ప్లానింగ్.

భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటంటే?
తెలంగాణ అిస్థిత్వాన్ని, సంస్కృతిని దశ దిశలా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం తరపున తెలంగాణ ఫిలిం స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం తరఫున ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తే ఇంకా బావుంటుంది. తెలంగాణ సినిమా సమగ్ర చరిత్రను, తెలంగాణ దర్శక నిర్మాతలు, కళాకారుల చరిత్రను ఒక చోట నిక్షిప్తం చేస్తాం. పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం. చిన్న సినిమాల విడుదలలు సాఫీగా జరిగేలా చూస్తాం. తెలంగాణ సినిమాకు ఓ ఊతం ఇచ్చేలా మంచి చిత్రాల నిర్మాణానికి పూనుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement