Telangana cinema
-
ఏపీ, తెలంగాణ సినీ స్టార్స్ క్రికెట్
-
తెలంగాణ 'సినిమా'పై సమావేశం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ సినిమా "నిన్న నేడు రేపు" అనే సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ పాల్గొన్నారు. పలువురు మేధావులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ సినిమా తీరుతెన్నులపై చర్చించారు. -
తెలంగాణ సినిమా ఉద్యమంలా ఎదగాలి
సప్తగిరికాలనీ : వలసవాద దోపిడీ నుంచి విముక్తి పొందిన తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగం స్వతంత్రంగా ఉద్యమంలా ఎదగాలని కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. మంగళవారం ఎస్సారార్ కళాశాల సత్యజిత్ రే ఫిలిం క్లబ్, కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘తెలంగాణ సినిమా.. దశ దిశ సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాకారులు, రచయితలు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ తెలంగాణ సినిమాను అంతరాతీయస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. కళాకారులందరినీ ఒకేవేదికపైకి తీసుకు రావాలన్నారు. ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సినిమాలో తెలంగాణ కళాకారుల పాత్ర అత్యంత దయనీయమైనదన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం తెలంగాణ సినిమా ద్వారా జరుగుతోందని అన్నారు. సినీ విమర్శకులు వారాల ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ ఫిలిం పాలసీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఫిలిం ఇనిస్టిట్యూట్, ఫిలిం డెవ లప్మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ అధ్యక్షులు సయ్యద్ ముజఫర్, శ్రీరాముల సత్యనారాయణ, గండ్ర లక్ష్మణ్‌రావు, రవీందర్రావు, శ్రీనివాస్, సత్యనారాయణ, విజయరావు, దీప్తిరెడ్డి, రాజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సినీ పరిశ్రమ దారెటు..?
-
అదే జరిగితే ప్రభుత్వం, పరిశ్రమ రెంటికీ నష్టమే!
-
తెలంగాణ సినిమా అంటే..?
-
తెలంగాణ చిత్రసీమలో చాలా అద్భుతాలు జరుగుతాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది. అన్ని సంస్థలూ శాఖల్లోనూ ఈ విభజన కనబడుతోంది. మరి తెలుగు చిత్రసీమ భవిష్యత్తు ఏమిటి? తెలుగు సినిమా నుంచి తెలంగాణ సినిమా విడిపోనుందా? ఈ విషయమై ఏవేవో అపోహలు, రకరకాల ఊహాగానాలు. ‘కొమరం భీమ్’ లాంటి చిత్రాలు డెరైక్ట్ చేసి, ప్రస్తుతం తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతోన్న అల్లాణి శ్రీధర్ ఈ విషయాలపై కొంచెం క్లారిటీ నిచ్చారు. ఎందుకు విడిపోవాలంటే? రాష్ట్రమే విడిపోయాక, సినిమా పరిశ్రమ కలిసి ఉండాలనడం కరెక్ట్ కాదు. ఇన్నేళ్లు అనేక రకాలుగా తెలంగాణ కళాకారులు వివక్ష నెదుర్కొన్నారు. ఇతివృత్తాల పరంగా కూడా తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది. మా భాషనీ, యాసనీ, జీవన విధానాన్నీ, సంస్కృతిని కూడా హేళనగా చూస్తున్నారు. పరిశ్రమ కొన్ని కుటుంబాలకే పరిమితమై పోయింది. బి. నరసింగరావులాంటి ప్రముఖులకు వజ్రోత్సవాలు, వందేళ్ల వేడుకల సమయంలో కనీస ఆహ్వానం కూడా లేదు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎలా విడిపోతామంటే? ఇన్నాళ్లూ ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 23 జిల్లాలు ఉన్నాయి. ఇకపై సీమాంధ్రలోని 10 జిల్లాలకు సంబంధించి తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ పని చేస్తుంది. ఇలా 24 శాఖల్లోనూ విభజన ఉంటుంది. దీనివల్ల ఎవ్వరూ నష్టపోవడం ఉండదు. సంస్థల పరంగా విడిపోయినా, అందరం హాయిగా కలిసి పని చేసుకోవచ్చు. భవిష్యత్తులో తెలంగాణ చిత్రసీమలో చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు విడిపోతామంటే? బి. నరసింగరావు నేతృత్వంలో మరో రెండు వారాల్లో మేమంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలవబోతున్నాం. ఇక్కడున్న సినిమా వనరులు గురించి, కళాకారుల గురించి పూర్తి స్తాయి సమాచారాన్ని సీఎమ్‌కు ఓ నివేదిక రూపంలో ఇవ్వబోతున్నాం. ఇన్నాళ్లూ అన్నదమ్ముల్లా ఒకే ఇంట్లో ఉన్నాం. మా వాటాకు చాలా రిపేర్లు ఉన్నాయి. దాన్ని బాగు చేసుకునేకన్నా చిన్నదైనా సరే కొత్త ఇల్లు కట్టుకుందామన్నది మా ప్లానింగ్. భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటంటే? తెలంగాణ అిస్థిత్వాన్ని, సంస్కృతిని దశ దిశలా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం తరపున తెలంగాణ ఫిలిం స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం తరఫున ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తే ఇంకా బావుంటుంది. తెలంగాణ సినిమా సమగ్ర చరిత్రను, తెలంగాణ దర్శక నిర్మాతలు, కళాకారుల చరిత్రను ఒక చోట నిక్షిప్తం చేస్తాం. పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం. చిన్న సినిమాల విడుదలలు సాఫీగా జరిగేలా చూస్తాం. తెలంగాణ సినిమాకు ఓ ఊతం ఇచ్చేలా మంచి చిత్రాల నిర్మాణానికి పూనుకుంటాం.