శ్రీదేవి ఉద్వేగంతో కంట | Marathi film 'Tapaal' leaves Sridevi teary-eyed | Sakshi
Sakshi News home page

శ్రీదేవి ఉద్వేగంతో కంట

Published Wed, Sep 24 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

శ్రీదేవి ఉద్వేగంతో కంట

శ్రీదేవి ఉద్వేగంతో కంట

ఓ మారుమూల గ్రామానికి, ఓ పోస్ట్‌మేన్‌కి మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘తపాల్’. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో ఈ చిత్రం హాట్ టాపిక్‌గా నిలిచింది. శుక్రవారం నాడు విడుదల కానున్న ఈ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులు చూశారు. వారిలో శ్రీదేవి ఒకరు. ఈ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, శ్రీదేవి కోసం ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి మరీ సినిమా చూపించారు. చూసిన తర్వాత శ్రీదేవి ఉద్వేగంతో కంట తడిపెట్టారు. ‘‘దర్శకునిగా లక్ష్మణ్‌కి ఇది మొదటి సినిమా. అయినప్పటికీ ఎంతో అద్భుతంగా తీశారు.
 
 ఈ మధ్యకాలంలో నన్ను చాలా ఉద్వేగానికి గురిచేసిన చిత్రమిది’’ అని సామాజిక నెట్‌వర్క్ ట్విట్టర్‌లో శ్రీదేవి పేర్కొన్నారు. ఇంతకీ శ్రీదేవికి ఈ చిత్రాన్ని చూపించాలని లక్ష్మణ్ ఎందుకనుకున్నారంటే.. చాలాకాలం తరువాత వెండితెరపైకి వచ్చిన చిత్రం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కి ఛాయాగ్రాహకునిగా పని చేసింది ఆయనే. ఆ విధంగా ఆమెతో లక్ష్మణ్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. పైగా శ్రీదేవి మంచి నటి కాబట్టి, తన ప్రయత్నాన్ని ఆమెకు చూపించాలనుకున్నారట లక్ష్మణ్. ఆ సంగతి ఆయనే విలేకరులకు చెప్పుకొచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement