డైరెక్టర్ అవ్వాలని...
పెద్ద హీరోను డైరెక్ట్ చేసి లైఫ్‌లో సెటిల్ అయిపోదామనుకున్న అబ్బాయి ఓ అమ్మాయితో లవ్‌లో పడతాడు. అలా డైరెక్షన్ దారి తప్పుతుంది. కానీ, మేడ మీద అబ్బాయి దారిలోకి అమ్మాయి వస్తుంది. డైరెక్టర్ కావాలనుకున్న ఆ అబ్బాయి లవ్‌ను ఎలా డైరెక్షన్ చేసుకున్నాడు? అన్న అంశాలతో రూపొందిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. ‘అల్లరి’ నరేశ్ హీరోగా జి. ప్రజిత్ దర్శకత్వంలో శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించారు.
ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. రెండు రోజుల్లో పది లక్షలు వ్యూస్ సాధించింది. ‘ఈ మేడమీద అబ్బాయిని అందరూ మీ ఇంటి అబ్బాయిలా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నరేశ్. ‘‘రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. నరేశ్ కేరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది. ఈ నెలలో ఆడియోను, సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చంద్రశేఖర్. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: షాన్ రెహమాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎమ్.ఎస్ కుమార్.