థ్రిల్.. నవ్వుల్
అల్లరి నరేశ్, నిఖిల విమల్ జంటగా జి. ప్రజిత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘మేడమీద అబ్బాయి’. నీలిమ సమర్పకురాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్న సందర్భంగా బొప్పన చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘కొత్త కథతో రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిన్మాలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది. థ్రిల్లింగ్‌గా ఉంటూనే నరేశ్ శైలి వినోదం పంచుతుంది.
‘గమ్యం, శంభో శివ శంభో’ తర్వాత ఆ తరహా సున్నితమైన కథతో నరేశ్ చేస్తున్న చిత్రమిది. తన కెరీర్‌లో మరో మైలురాయిలా నిలుస్తుందనే నమ్మకం ఉంది. సెప్టెంబరు 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్, తులసి, సుధ, ‘సత్యం’ రాజేష్, నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఎగ్జిక్యూ టివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్.