పెళ్లికి ముందు నటించిన చివరి చిత్రం! | Meera Jasmine Before the wedding last film | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు నటించిన చివరి చిత్రం!

Aug 24 2015 12:12 AM | Updated on Sep 3 2017 8:00 AM

పెళ్లికి ముందు నటించిన చివరి చిత్రం!

పెళ్లికి ముందు నటించిన చివరి చిత్రం!

పందెం కోడి, భద్ర, గుడుంబా శంకర్.. తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మీరా జాస్మిన్. గత ఏడాది ఈ మలయాళ భామ పెళ్లి చేసుకున్నారు.

 పందెం కోడి, భద్ర, గుడుంబా శంకర్.. తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మీరా జాస్మిన్. గత ఏడాది ఈ మలయాళ భామ పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లికి ముందు ఆమె నటించిన మలయాళ చిత్రం ‘ది ఐస్’ని అదే పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డీవీ వెంకటేశ్ తెలుగులోకి విడుదల చేయనున్నారు. హార్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించిందని వెంకటేశ్ తెలిపారు. ప్రస్తుతం రీ-రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుతున్నామని అన్నారు. మీరా జాస్మిన్ నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వెంకటేశ్ చెప్పారు. ఈ చిత్రానికి షాజియం దర్శకుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement