సిక్స్‌ ప్యాక్‌ మజ్ను | mister majnu movie shooting in hyd | Sakshi
Sakshi News home page

సిక్స్‌ ప్యాక్‌ మజ్ను

Published Sun, Nov 18 2018 3:38 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

mister majnu movie shooting in hyd - Sakshi

అఖిల్‌

రెండు రోజులుగా ‘మిస్టర్‌ మజ్ను’ నైట్‌ అంతా ఫైట్‌ చేస్తూనే ఉన్నారట. మరి ఆ గొడవ గాళ్‌ ఫ్రెండ్‌ కోసమా? లేక మరేదైనా విషయమా? తెలియాలంటే ‘మిస్టర్‌ మజ్ను’ సినిమా చూడాల్సిందే. అఖిల్‌ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఫైట్‌ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు చిత్రబృందం. 5 రోజుల పాటు ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ తీస్తారని సమాచారం. ఆల్రెడీ ఈ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇటీవల తెరకెక్కించిన ఓ సాంగ్‌లో అఖిల్‌ తన సిక్స్‌ ప్యాక్‌ చూపించారట. ఈ పాట అభిమానులను ఖుష్‌ చేస్తుందనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జార్జ్‌ సి. విలియమ్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement