సిక్స్‌ ప్యాక్‌ మజ్ను | mister majnu songs on good response | Sakshi
Sakshi News home page

సిక్స్‌ ప్యాక్‌ మజ్ను

Published Tue, Dec 25 2018 2:50 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

mister majnu songs on good response - Sakshi

అఖిల్‌

కళ్లెదుట లవర్‌ ఉన్నప్పుడు బోలె డన్ని తీపి కబుర్లు చెప్పుకుంటాం. లేనప్పుడు మాటలు మరచిపోయినంత పనవుతుంది. మజ్నూకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’ అని పాట అందుకున్నాడు. మాటలే రాకపోతే పాట పాడటం ఏంటీ అనుకుంటారేమో. తన భావాన్ని పాట రూపంలో చెప్పాడు మజ్ను. ఇటీవల విడుదలైన ఈ పాటను విన్నాం. ఇప్పుడు మజ్ను మరో పాట వినిపించడానికి రెడీ అయ్యాడు. అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’.

తమన్‌ స్వరకర్త. ఇటీవల విడుదల చేసిన ‘ఏమైనదో.. ఏమైనదో..’ పాటకు మంచి స్పందన లభిస్తోందని, తమణ్‌ బాణి, శ్రీమణి సాహిత్యం బాగా కుదిరాయని చిత్రబృందం పేర్కొంది. క్రిస్మస్‌ సందర్భంగా టైటిల్‌ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. అన్నట్లు.. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే... ఈ సినిమాలో అఖిల్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపిస్తారని అర్థమైంది కదూ. అఖిల్‌ సరసన ని«ధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాశ్, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్‌ సి. విలియమ్స్, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement