కొంచెం ఫారిన్‌... కొంచెం లోకల్‌! | Akhil Akkineni's Mr Majnu to release in January | Sakshi
Sakshi News home page

కొంచెం ఫారిన్‌... కొంచెం లోకల్‌!

Published Thu, Nov 22 2018 12:15 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Akhil Akkineni's Mr Majnu to release in January - Sakshi

మోడల్స్‌తో అఖిల్‌

లవర్‌బాయ్‌ ఇంట్రడక్షన్‌ అంటే ఎలా ఉండాలి? అదిరిపోయే లొకేషన్స్‌లో బ్యూటిఫుల్‌ మోడల్స్‌ మధ్య ఐ ఫీస్ట్‌లా ఉండాలి. సేమ్‌ ఇలానే ప్లాన్‌ చేశారు అఖిల్‌ అండ్‌ టీమ్‌. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’.  ఇందులో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్‌ చేసిన టీజర్‌ను బట్టి అఖిల్‌ ప్లేబాయ్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఇంట్రడక్షన్‌ సాంగ్‌లోనే షర్ట్‌ విప్పి సిక్స్‌ ప్యాక్‌ చూపించనున్నారు అఖిల్‌.

ఆ మధ్య జరిగిన యూకే షెడ్యూల్‌లో అఖిల్‌తో పాటు 30 నుంచి 40 మంది మోడల్స్‌ పాల్గొనగా ఈ పాట మేజర్‌ షూటింగ్‌ జరిగింది. ఇదే సాంగ్‌లోని కొంత భాగాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో షూట్‌ చేశారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌. ఈ సినిమాలో ఈ సాంగ్‌ హైలైట్‌గా ఉంటుందని యూనిట్‌ సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారట టీమ్‌. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ మరో వారం రోజుల్లో హైదరాబాద్‌లో స్టార్ట్‌ కానుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. ఆల్రెడీ అన్ని పాటల కంపోజిషన్‌ను పూర్తి చేశారు. జనవరిలో చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement