డేట్‌ ఫిక్స్‌ | Akhil Akkineni's Mr Majnu to release in January | Sakshi
Sakshi News home page

డేట్‌ ఫిక్స్‌

Published Sun, Nov 25 2018 2:06 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Akhil Akkineni's Mr Majnu to release in January - Sakshi

అమ్మాయిల చుట్టూ తిరిగే కుర్రాడు రోమియో అవుతాడు. వాళ్లకు నచ్చితే ప్రేమియో అవుతాడు. మరి మజ్ను అయ్యాడంటే కచ్చితంగా ఏదో ఓ కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలంటే బిగ్‌ స్క్రీన్‌పైనే చూడాలి. అఖిల్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’.

నిధీ అగర్వాల్‌ కథానాయిక. బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ షూటింగ్‌ దాదాపు పూర్తయిందని సమాచారం.  ఈ సినిమాను రిపబ్లిక్‌ డే వారంలో జనవరి 25న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఇందులో అఖిల్‌ ప్లే బాయ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జార్జి సి. విలియమ్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement