టీవీ నటికి గాయం
ముంబై: టీవీ నటి 'నాగిని' ఫేం మౌని రాయ్ గాయపడింది. డాన్స్ రియాలిటీ షో 'ఝలక్ దిఖ్లాజా-9'లో తన ప్రతిభ చాటుకునేందుకు సిద్ధమవుతుండగా ఆమె గాయం బారిన పడింది. స్పెషల్ ఎపిసోడ్ కోసం సహనటుడు అర్జున్ బిజలానీతో కలిసి డాన్స్ చేస్తుండగా ఆమె మెడకు గాయమైంది. 'బాజీరావ్ మస్తానీ' సినిమాలో మల్హారి పాటకు డాన్స్ చేస్తుండగా మౌని రాయ్ గాయపడింది. అక్కడున్నవారు వెంటనే ఆమెకు సఫర్యలు చేశారు.
అంతకుముందు ఇదేవిధంగా అర్జున్ బిజలానీ, సిదాంత్ గుప్తా కూడా గాయాలపాయ్యారు. 'ఝలక్ దిఖ్లాజా-9' డాన్స్ రియాలిటీ షో జూలై 30 నుంచి కలర్స్ చానల్ లో ప్రసారం కానుంది. జాక్వెలెస్ ఫెర్నాండెస్, కరణ్ జోహార్, గణేశ్ హెగ్డె న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.