కమల్ సినిమాకు వరుస కష్టాలు | Multiple hurdles for Kamal Haasan Sabhash Naidu | Sakshi
Sakshi News home page

కమల్ సినిమాకు వరుస కష్టాలు

Published Wed, Jul 27 2016 10:48 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

కమల్ సినిమాకు వరుస కష్టాలు

కమల్ సినిమాకు వరుస కష్టాలు

లోకనాయకుడు కమల్ హాసన్కు సినిమా కష్టాలు తప్పటం లేదు. గతంలో కమల్ సినిమా రిలీజ్ విషయంలో సమస్యలు తలెత్తేవి.. కానీ ఇప్పుడు షూటింగ్ సమయంలోనే ఈ యూనివర్సల్ స్టార్ ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో శభాష్ నాయుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు కమల్. బ్రహ్మానందం, శృతి హాసన్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను మళయాల స్టార్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా రాజీవ్ తప్పుకోవటంతో కమల్ దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నాడు. విజయవంతంగా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన కమల్, తన ఆఫీస్లో గాయపడటంతో సినిమా షూటింగ్కు మరోసారి బ్రేక్ పడింది.

కమల్ కొలుకుంటున్న సమయంలోనే ఈ సినిమాకు ఎడిటర్గా పనిచేస్తున్న జేమ్స్ జోసెఫ్ భార్య మరణించటంతో ఆయన కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. తాజాగా చిత్ర సినిమాటోగ్రాఫర్ కూడా తప్పుకున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ దర్శకత్వ బాధత్యలు తీసుకున్న తరువాత కెమరామేన్ జయకృష్ణ పనితీరు నచ్చకపోవటంతో ఆయన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నాడట. ఇలా వరుస కష్టాలు కమల్ సినిమాను వేదిస్తున్నాయి. మరి వీటన్నింటినీ దాటి శభాష్ నాయుడు ఎప్పుడు థియేటర్లకు చేరతాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement