ముంబై : యువ కథనాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌నే కాకుండా దేశ ప్రజలను షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే. జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్.. ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సుశాంత్ నివాసంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో పోలీసులు ఇది ఆత్మహత్యా.. లేకపోతే దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి : సుశాంత్ అస్థికలు గంగలో నిమజ్జనం)
ఇప్పటికే సుశాంత్ సన్నిహితులతోపాటుగా అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్ చబ్రా నుంచి కూడా పోలీసులు విచారించారు. తాజాగా ముంబై పోలీసులు సుశాంత్ నివాసం నుంచి 5 పర్సనల్ డైరీలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ డైరీలను నిపుణుల సమక్షంలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. దీంతో అతని జీవితంలో ఏం జరిగిందనే దానిపై కొంతమేర స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment