Dairies
-
డిజిటల్ ఇండియా: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ ఉధృతి, తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, విభాగాల్లో డైరీలు, గ్రీటింగ్ కార్డులు, కాఫీ టేబుల్ బుక్స్, క్యాలెండర్లను భౌతిక రూపంలో ముద్రించడాన్నిని షేధించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలు, విభాగాలు,స్వయంప్రతిపత్త సంస్థలతో పాటు, ఇతర ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధిత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. రాబోయే సంవత్సరంలో ఏ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల్లో వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు ఇతర వస్తువులను ముద్రించకూడదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక పొదుపు చర్యల కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం (సెప్టెంబర్ 2న) ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇపుడు ఇవన్నీ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు,పండుగ గ్రీటింగ్ కార్డులు లాంటి వాటిని ఇకపై ఇ-బుక్స్ రూపంలో మాత్రమే అందించాలని ఆదేశించింది. ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఉత్పాదకత రెట్టింపు, ప్రణాళిక, షెడ్యూలింగ్, అంచనాలకు నూతన సాంకేతిక ఆవిష్కరణల ఉపయోగంతో ఖర్చులను తగ్గించుకోవడమే కాదు నిర్వహణ కూడా సమర్థవంతంగా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది. -
సుశాంత్ నివాసంలో 5 డైరీలు స్వాధీనం!
ముంబై : యువ కథనాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌నే కాకుండా దేశ ప్రజలను షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే. జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్.. ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సుశాంత్ నివాసంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. దీంతో పోలీసులు ఇది ఆత్మహత్యా.. లేకపోతే దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి : సుశాంత్ అస్థికలు గంగలో నిమజ్జనం) ఇప్పటికే సుశాంత్ సన్నిహితులతోపాటుగా అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్ చబ్రా నుంచి కూడా పోలీసులు విచారించారు. తాజాగా ముంబై పోలీసులు సుశాంత్ నివాసం నుంచి 5 పర్సనల్ డైరీలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ డైరీలను నిపుణుల సమక్షంలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. దీంతో అతని జీవితంలో ఏం జరిగిందనే దానిపై కొంతమేర స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. -
హైదరాబాద్ డైరీస్
-
ఉద్యోగ సంఘాల డైరీ, కేలండర్ లను ఆవిష్కరించిన : సీఎం జగన్
-
చక్కెర ఫ్యాక్టరీలకు పునర్ వైభవం
వైఎస్సార్ చేయూత ద్వారా వచ్చే నాలుగేళ్లలో మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నాం. తద్వారా డెయిరీ కార్యక్రమాల ద్వారా వారి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో సహకార డెయిరీల బలోపేతం, డెయిరీ రంగంలో మహిళల భాగస్వామ్యం, పాడి పశువులను గణనీయంగా పెంచడమనే మూడు కోణాల్లో కార్యక్రమాలు విస్తృతం చేస్తాం. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై పెట్టే ప్రతి పైసా సద్వినియోగం కావాలి. సొంత కాళ్ల మీద ఫ్యాక్టరీ నిలబడాలి. రైతులు ఆనందంగా ఉండాలి. అప్పుడు కొంత, ఇప్పుడు కొంత ఇచ్చి.. అటూ ఇటూ కాకుండా ఫ్యాక్టరీని, రైతులను ఇబ్బంది పెట్టొద్దు. రెండు మూడేళ్లలో వీటిని అత్యంత ఆధునిక పరిశ్రమలుగా తీర్చిదిద్దాలి. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సహకార చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీల పునర్ వైభవానికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పని చేస్తున్న ఫ్యాక్టరీలను మరింత బలోపేతం చేయడంతో పాటు మూత పడిన వాటిని తెరిపించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పుడున్న పోటీని తట్టుకుని, లాభదాయకంగా నడపడానికి తీసుకోవాల్సిన చర్యలను అందులో పొందుపరచాలన్నారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డెయిరీలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కర్మాగారాలను అభివృద్ధి చేయడంతోపాటు ఉప ఉత్పత్తుల ద్వారా అవి సొంతకాళ్ల మీద నిలబడేందుకు అవసరమైన ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. చెరకు సరఫరా చేసిన రైతులకు బకాయిలను చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చెరకు పంట సాగు, సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి గురించి అధికారులు సీఎంకు నివేదించారు. ఫ్యాక్టరీల వారీగా రైతుల బకాయిలు, రుణాలు.. తదితర అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి ఇదీ.. - దేశంలో 330.70 లక్షల మెట్రిక్ టన్నుల పంచదార ఉత్పత్తి అవుతోంది. అత్యధికంగా 116.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 5.02 లక్షల మెట్రిక్ టన్నులతో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. కాగా రాష్ట్రంలో 10.23 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర డిమాండ్ ఉంది. - ఒక్కో హెక్టారుకు చెరకు ఉత్పత్తిలో 105 మెట్రిక్ టన్నులతో తమిళనాడు దేశంలో ప్రథమ స్థానంలో ఉండగా, 78 మెట్రిక్ టన్నులతో ఏపీ ఏడో స్థానంలో ఉంది. - మన రాష్ట్రంలో 29 చక్కెర కర్మాగారాలకుగాను 18 మాత్రమే పని చేస్తున్నాయి. మహారాష్ట్రలో 264 ఉంటే 195 పనిచేస్తున్నాయి. - రాష్ట్రంలో 2006–07లో 100.91 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ అయ్యేది. 2018–19 నాటికి అది 54.05 లక్షల టన్నులకు పడిపోయింది. - సహకార చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించి విజయనగరం జిల్లా భీమసింగిలోని విజయరామగజపతి, విశాఖపట్నం జిల్లా చోడవరం, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు మాత్రమే ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్నాయి. అనకాపల్లి (ఎన్నికల ముందు ప్రారంభమైనా మళ్లీ మూత), గుంటూరు జిల్లా జంపని, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని శ్రీ వెంకటేశ్వర, చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ, కడప సమీపంలోని చెన్నూరు సుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. పది సహకార సుగర్ ఫ్యాక్టరీలపై రూ.891.13 కోట్ల భారం ఉంది. సీఎం సూచనలు, ఆదేశాలు.. - సహకార ఫ్యాక్టరీల నుంచి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా దృష్టి సారించాలి. - ప్రస్తుతం నడుస్తున్న నాలుగు సహకార చక్కెర ఫ్యాక్టరీలను పూర్తి స్థాయిలో ఆధునికీకరించడానికి, మూత పడిన వాటిని తెరవడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి. - వైఎస్సార్ జిల్లా చెన్నూరు, చిత్తూరు జిల్లా గాజులమండ్యం, విశాఖ జిల్లా అనకాపల్లి ఫ్యాక్టరీలను వెంటనే పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. - తెరవడానికి అవకాశం లేని సహకార చక్కెర కర్మాగారాల విషయంలో ఉన్న బకాయిలను తీర్చడానికి ఏం చేయాలన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేయండి. - మొలాసిస్ లాంటి ఉప ఉత్పత్తుల వల్ల ఆర్థిక ప్రయోజనం సమకూరే మార్గాలపైనా దృష్టిపెట్టాలి. - ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఇతరత్రా అంశాలపై దృష్టి సారించాలి. - సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలి. - ఎన్నికల ప్రణాళికలో నిర్దేశించిన విధంగా సహకార డెయిరీలకు పాలు పోస్తున్న రైతుకు ప్రతి లీటరుకు రూ.4ల బోనస్ ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించాలి. - సహకార డెయిరీలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల స్థితిగతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలి. డెయిరీల సామర్థ్యాన్ని పెంచేందుకు, మార్కెటింగ్‌లో కొత్త వ్యూహాలు దిశగా అడుగులు వేయాలి. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ల భాగస్వామ్యం దిశగా ఆలోచించాలి. - రాష్ట్రంలో చెరకు సాగు తగ్గకుండా మరింత పెరిగేలా, నాణ్యత ఉండేలా వ్యవసాయ శాఖ దృష్టి సారించాలి. చెరకు నాటడానికి, కటింగ్‌కు ఫ్యాక్టరీ ద్వారా అత్యాధునిక పరికరాలను రైతులకు అందించేలా చూడాలి. అధిక దిగుబడి కోసం తమిళనాడు విధానాలను పరిశీలించండి. -
పాడి రైతుకు చీకట్లు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాల సేకరణ ప్రోత్సాహక రాయితీ నిలిపేయడంతో రాష్ట్రంలో పాడి రైతాంగం మళ్లీ ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. రాయితీతో నష్టాల నుంచి గట్టెక్కిన చిన్న డెయిరీలు సంక్షోభంలో పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లీటర్‌కు రూ.4 ప్రోత్సాహక రాయితీ పాడి ఉత్పత్తి పెరగడానికి దోహదం చేసింది. 2014 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆరు మాసాల్లోనే పాల దిగుబడి 46 శాతం పెరిగింది. ఒకటో రెండో గేదెలున్న ప్రతి రైతు అప్పు చేసైనా మరో నాలుగైదు గేదెలు కొని డెయిరీని విస్తరించుకున్నారు. పెద్ద రైతులైతే కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రోత్సాహక రాయితీ వల్ల లాభాల్లో పడ్డామని, పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని ఆశిస్తున్న తరుణంలో రాయితీ నిలిచిపోయిందని వాపోతున్నారు. ఈ తరుణంలో తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు ఆందోళన చేస్తున్నారు. దాదాపు రెండు వేల మంది రైతులు ఈ రాయితీని నమ్ముకుని డెయిరీ వ్యాపారంలోకి దిగారు. దూసుకుపోతున్న కర్ణాటక 2011లో కర్ణాటక ప్రభుత్వం లీటర్ పాలకు రూ.2 ప్రోత్సాహక రాయితీ ప్రకటించడంతో అక్కడ పాడి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కర్ణాటక ఇప్పటిదాకా రాయితీ కింద రైతులకు రూ.3,160 కోట్లు చెల్లించింది. రెండేళ్ల క్రితం రాయితీని రూ.4కు పెంచింది. గత ఏడాది కర్ణాటక పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ రోజుకు 70 లక్షల లీటర్లు సేకరిస్తూ రైతులకు రాయితీ కింద రూ.1,000 కోట్లు చెల్లించింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రోజుకు 4.87 లక్షల లీటర్లు సేకరించడానికి కేవలం రూ.60 కోట్లు వ్యయం చేసింది. కర్ణాటకలోని ఒక్క తుముకూర్ జిల్లాలోనే 5.5 లక్షల లీటర్లు సేకరించి రూ.75 కోట్లు ప్రోత్సాహక రాయితీగా ఇచ్చారు. అవసరాలకు మించి పాలు సేకరిస్తున్న ఆ రాష్ట్ర పాడి సంస్థ మిగులు పాలను చెన్నై, గోవా, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకు సరఫరా చేస్తోంది. ఇక్కడ డిమాండ్‌కు తగ్గట్టు పాడి ఉత్పత్తి ఉండాలంటే ప్రోత్సాహక రాయితీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రోత్సాహక రాయితీ రద్దు చేస్తే పాడిరైతులు దారుణంగా దెబ్బతింటారని బ్యాంకర్లు సైతం అంటున్నారు. అప్పుడు సాగు.. ఇప్పుడు పాడి బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని పది గేదెలను కొని చిన్నపాటి డెయిరీ ప్రారంభించా. అప్పటికే వ్యవసాయంలో భారీగా నష్టపోయి అప్పులపాలవడంతో ప్రోత్సాహక రాయితీ ప్రకటనతో జీవితంపై ఆశలు చిగురించాయి. సగానికిపైగా భూమిని అమ్ముకుని అప్పులు తీర్చాను. మిగిలిన మొత్తాన్ని డెయిరీ కోసం ఖర్చు చేశా. ఇప్పుడు మళ్లీ తన జీవితంలో ఇలా చీకటి వస్తుందని ఊహించలేదు. -కందాల శ్రీనివాస్‌రెడ్డి, ఎదుళ్లగూడెం, వలిగొండ మండలం (నల్లగొండ) డెయిరీ మూయక తప్పదు ప్రభుత్వం ప్రోత్సాహక ధర ఇవ్వడంతో రూ.30 కోట్లతో నా డెయిరీని విస్తరించా. అధిక మొత్తాన్ని బ్యాంక్‌ల నుంచి రుణంగా తీసుకున్నా. ఇప్పుడు ప్రోత్సాహకం లేదంటే నా పరిస్థితి ఏంటి? డెయిరీలో రోజుకు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నా. అలాగే, గేదెలకు గడ్డి కోసం సమీప గ్రామాల్లోని రైతులకు ముందే పెట్టుబడి ఇచ్చా. రాయితీ ఆపేయడంతో నేను డెయిరీని మూయక తప్పదు. -పి.సునీల్‌రావు, హన్మాజ్పల్లి, లోయర్ మానేరు డ్యామ్ పక్క గ్రామం (కరీంనగర్) రాయితీ లేకపోతే ఎలా? గంపెడాశలతో కోట్లు ఖర్చు చేసి గేదెలను కొన్నా. గ్రామంలోని ఇతర రైతుల భూముల్లో గడ్డి సాగు చేయిస్తున్నా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 150 మందికి ఉపాధి లభిస్తోంది. దాణా, గడ్డికి భారీగా వ్యయమవుతూ లాభాల్లేక మూసుకుంటున్న తరుణంలో ప్రోత్సాహక రాయితీ వరమైంది. ఇప్పుడు పెద్ద రైతులకు రాయితీ లేకపోతే ఎలా? -ధరణీపతి రఘు, తిమ్మారెడ్డిపల్లి, పెద్ద అడిసర్లపల్లి మండలం (నల్లగొండ)