‘సైరా’ టీజర్‌ రెడీ! | Music Director Amit Trivedi tweet About Chiranjeevi Sye Raa movie | Sakshi
Sakshi News home page

‘సైరా’ టీజర్‌ సిద్దం : మ్యూజిక్ డైరెక్టర్

Published Mon, Aug 20 2018 11:06 AM | Last Updated on Mon, Aug 20 2018 12:52 PM

Music Director Amit Trivedi tweet About Chiranjeevi Sye Raa movie - Sakshi

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి ఉగ్రరూపాన్ని చూసేందుకు మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి బర్త్‌డే (ఆగస్టు 22) సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను అభిమానులకు కానుకగా ఇవ్వనున్నారన్న సంగతి తెలిసిందే. 

‘సైరా’ టీజర్‌ రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు బాలీవుడ్‌ సెన్సెషన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ టీజర్‌ గురించి ట్వీట్ చేస్తూ.. ‘నేను కూడా ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి చారిత్రక సినిమాలో భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి అయింది. మీ ఫీడ్ బ్యాక్ కోసం వేచి చూస్తున్నా’’ అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement