ప్రేమ...అంత ఈజీ కాదు! | music director koti son lounched he's next movie premante suluvu kadura | Sakshi
Sakshi News home page

ప్రేమ...అంత ఈజీ కాదు!

Published Tue, Mar 22 2016 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

ప్రేమ...అంత ఈజీ కాదు!

ప్రేమ...అంత ఈజీ కాదు!

 ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, సిమ్మీదాస్ జంటగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమంటే సులువు కాదురా’. చందా గోవిందరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆర్‌పి ప్రొడక్షన్స్ పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తీసిన చిత్రమిది. మా చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు మంచి చిత్రమంటూ అభినందించి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. వారి ప్రశంస ఈ చిత్రం విజయంపై మాకు మరింత నమ్మకం కలిగించింది. నందన్‌రాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది.  ‘ప్రాణం’ కమలాకర్ రీ రికార్డింగ్ హైలెట్. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: సురేష్ రఘుట, సహ నిర్మాతలు: కొమారి సుధాకర్‌రెడ్డి- శ్రీపతి శ్రీరాములు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement