
నా లైఫ్ పర్‌ఫెక్ట్ కాదు: నటి
లాస్‌ఎంజెల్స్: తన జీవితం సంపూర్ణంగా లేదని ప్రముఖ హాలీవుడ్ నటి కేథరిన్ హైగల్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, అలాంటి జీవితంకోసం ప్రతిరోజు ప్రయత్నించేదాన్నని చెప్పింది. జోష్ కెల్లీని వివాహం ఆడిన ఆమెకు ముగ్గురు పిల్లలు. వారిలో నాలెయిగ్, అడలెయిడ్ అనే ఇద్దరు కుమార్తెలు కాగా, జోషువా అనే కుమారుడు ఉన్నాడు.
‘జీవితం సంపూర్ణం కాదు. సంపూర్ణతకు మాతృత్వానికి చాలా దూరం ఉంటుంది. కానీ, మనందరం దానికోసమే ప్రయత్నిస్తుంటాం. నేను యువతిగా ఉన్నప్పుడు ఫర్‌ఫెక్ట్‌గా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని. కానీ, ఇప్పుడు మాత్రం అది సాధ్యం కాదు. నేను ఎప్పుడు పనిలో ఉంటానో అప్పుడు కుటుంబానికి దూరం ఉండాల్సి వస్తుంది. కుటుంబంతో ఉంటున్నప్పుడు మాత్రం పనికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇలా రెండింటి మధ్య ఉండిపోతూ ఫర్‌ఫెక్షన్ సాధించలేకపోతున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.