'నా ఆలోచన కలంతోనే మొదలైంది' | My thinking process starts with my pen: Gulzar | Sakshi
Sakshi News home page

'నా ఆలోచన కలంతోనే మొదలైంది'

Published Thu, May 21 2015 10:54 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'నా ఆలోచన కలంతోనే మొదలైంది' - Sakshi

'నా ఆలోచన కలంతోనే మొదలైంది'

కోల్కతా: తన ఆలోచన కలంతోనే ప్రారంభమైందని బాలీవుడ్ ప్రముఖ హిందీ సినీ గేయాలు, కవిత్వాల రచయిత గుల్జార్ అన్నారు. దాదాపుగా అర్థశతాబ్దకాలం నుంచి కవిత్వాలు, సినిమా గీతాలు రాస్తున్న ఆయన  ఇప్పటికీ కూడా పెన్ను పేపర్ నే ఉపయోగిస్తున్నారట.' నా ఆలోచన విధానం మొదలైంది కలంతోనే. అందుకే రచనలకోసం ఎవరెవరు ఏం ఉపయోగించినా నేను మాత్రం ఇప్పటికి కాగితం, కలాన్ని నాతో ఉంచుకుంటాని అని చెప్పారు. తాను కంప్యూటర్ను, టాబ్లెట్ను ఉపయోగించనని చెప్పారు.

అయితే, ఉర్దూలో సైతం చేతివ్రాతతోనే రాసే తాను కంప్యూటర్ పై రాసే వారిని కూడా గౌరవిస్తానని చెప్పారు. తాను గతంలో జీవించే మనిషిని కాదని, ఇప్పటి తరంతో కలిసి కూడా సాగగలనని విశ్వాసం వ్యక్తం చేశారు. కజరారే, బీడీ జలై లే, జయహోవంటి ఎన్నో గొప్పగొప్ప లిరిక్స్ ఆయన రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement