పౌరాణిక కథతో... | Mythical story movie | Sakshi
Sakshi News home page

పౌరాణిక కథతో...

Published Sat, Mar 7 2015 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

పౌరాణిక కథతో...

పౌరాణిక కథతో...

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘వైవస్వత’. మోక్ష శ్రీమయి సమర్పణలో సింహవాహిని చలనచిత్ర పతాకంపై ఎస్. నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విసు రెడ్డి, షామిన్ మన్నన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వరుణ్‌వంశీ బలభద్రపాత్రుని-కార్తికేయ వరపర్ల దర్శకులుగా పరిచయమవుతున్నారు. పౌరాణిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామనీ, సాంకేతికంగా భారతీయ చలన చిత్రసీమ ఆశ్చర్యపోయే రీతిలో ఈ చిత్రం ఉంటుందని దర్శకులు తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ -‘‘విదేశాల్లోని దీవుల్లో, దట్టమైన అడవుల్లో ఎక్కువ శాతం చిత్రీకరిస్తాం. పౌరాణిక కథల్లో ఇప్పటివరకూ రాని కథతో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రకథా విశేషాలను తెలియజేసే ‘గ్రాఫిక్ బుక్’ని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె. బంగారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.ఎన్. మహేంద్రబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement