
ఫ్యామిలీ ట్రిప్ కోసం ఇటీవల స్పెయిన్ తీరాలకు వెళ్లొచ్చారు నాగార్జున. ఇప్పుడు ఆయన లండన్‌కి బై బై చెప్పారు. ఇంతకీ.. నాగార్జున లండన్‌కి ఎందుకు వెళ్లారు? మళ్లీ హాలిడే కోసమేనా? అనే కదా మీ సందేహం. కాదు.. కాదు.. నాగార్జున లండన్ వెళ్లింది హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ కోసం. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్ కపాడియా ముఖ్య తారలుగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
‘‘బ్రహ్మాస్త్ర’లోని స్మాల్ షూటింగ్ కోసం లండన్ వెళ్లాను. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తున్నాను’’ అని పేర్కొన్నారు నాగార్జున. తెలు గులో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా, ‘చి.ల.సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మరో సినిమాలో నాగార్జున నటించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment