సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సుధీర్ బాబు. తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఈ యంగ్ హీరో ఇటీవల ఓ భారీ బాలీవుడ్ సినిమాకు నో చెప్పాడట. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర. అమితాబ్ బచ్చన్, రణబీర్‌కపూర్, నాగార్జున లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో మెయిన్ విలన్స్‌లో ఒకరిగా సుధీర్ బాబు నటించాల్సిందిగా సుధీర్‌బాబును సంప్రదించారట.
అయితే బ్రహాస్త్ర 2020లో రిలీజ్ కానుంది. అదే సమయంలో పుల్లెల గోపిచంద్ బయోపిక్‌కు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న కారణంతో సుధీర్ ఆ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశాడట. ఫిజికల్ గా కూడా రెండు సినిమాలకు వేరియేషన్స్ చూపించాల్సి వస్తుందని అది కూడా బ్రహాస్త్రను రిజెక్ట్ చేయడానికి ఓ కారణం అని తెలిపారు. ఇటీవల రిలీజ్ అయిన నన్ను దోచుకుందువటే మూవీ ప్రమోసన్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు సుధీర్ బాబు.
Comments
Please login to add a commentAdd a comment