అప్పుడు నిర్మాతగా.. ఇప్పుడు హీరోగా? | Nani New Telugu Movie With Hit Director Sailesh Kolanu | Sakshi
Sakshi News home page

అప్పుడు నిర్మాతగా.. ఇప్పుడు హీరోగా?

Apr 16 2020 2:56 PM | Updated on Apr 16 2020 2:56 PM

Nani New Telugu Movie With Hit Director Sailesh Kolanu - Sakshi

అటు హీరోగా ఇటు నిర్మాతగా ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు నేచురల్‌ స్టార్‌ నాని. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ‘వి’ తర్వాత తన తదుపరి చిత్రాలు ‘టక్‌ జగదీష్‌’, ‘శాం సింగరాయ్‌’  అంటూ ప్రకటించాడు. వీటితో పాటు ‘బ్రోచేవారెవరురా’ఫేం వివేక్‌ ఆత్రేయతో ఓ సినిమాను పట్టాలెక్కించే పనిలో నాని ఉన్నట్లు టాలీవుడ్‌ టాక్‌. 

అయితే తాజాగా ‘హిట్‌’ఫేం శైలేష్‌ కొలనుతో నాని ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ మధ్య నానికి ఓ ఆసక్తికర పాయింట్‌ను శైలేష్‌ వినిపించాడని, అది నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేయమన్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అంతా సవ్యంగా జరిగితే... హిట్ సినిమా దర్శకుడితో నాని హీరోగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్‌ సేన్‌ ‘హిట్‌’ చిత్రానికి నానినే నిర్మాత అన్న విషయం తెలిసిందే. నిర్మాతగా నానికి విజయాన్ని అందించిన శైలేష్‌ మరి హీరోగా నానిని తెరపై ఎలా చూపిస్తాడో చూడాలి. అయితే వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సమయాన్ని వీర్దిదరు కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. 

చదవండి:
చైనా కావాలనే ఇలా చేసింది : హీరో నిఖిల్‌
కరోనా.. సీసీసీకి కాజల్‌ విరాళం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement