నిర్మాతగా... | Nara Rohit now turns producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా...

Published Thu, Jan 29 2015 11:41 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

నిర్మాతగా... - Sakshi

నిర్మాతగా...

‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’ తదితర చిత్రాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ నిర్మాతగా మారుతున్నారు. సతీశ్ దేవినేని చెప్పిన కథ నచ్చడంతో ఆయన్ను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ - ‘‘సతీశ్ చెప్పిన కథ విని, ఉద్వేగానికి గురయ్యా. అందుకే ఈ చిత్రాన్ని నేనే నిర్మించాలనుకున్నా. యూత్, ఫ్యామిలీస్, క్లాస్, మాస్.. ఇలా అందరూ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘పండగలా వచ్చాడు’, ‘అసుర’ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నానని రోహిత్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement