విభిన్నంగా ‘శంకర’
‘బాణం’లా తెరపైకి దూసుకొచ్చి ‘సోలో’గా ప్రేక్షకుల హృదయాలను గెలిచిన నారా రోహిత్ త్వరలో ‘శంకర’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాతినేని సత్య దర్శకత్వంలో వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల అమెరికన్ భామ హాజెల్ క్రౌనీపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్‌తో చిత్రీకరణ పూర్తయింది. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెలలోనే విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘నారా రోహిత్‌కి ఇది నిజంగా డిఫరెంట్ ఫిలిం.
ఇందులో రోహిత్‌కి జోడీగా రెజీనా నటిస్తున్నారు. ఆమె పాత్ర కథకు చాలా కీలకం. తాతినేని సత్య నవ్యంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువతరానికి బాగా నచ్చే సినిమా ఇది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: కె.ఎస్.రామారావు.