
నవ మన్మథుడిగా...
ఈ ఏడాది జనవరి 1న ‘రఘువరన్ బీటెక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు ధనుష్. సంచలన విజయం సాధించిన ఆ తమిళ అనువాద చిత్రానికి దర్శకుడు వేల్‌రాజ్. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన మరో తమిళ చిత్రం ‘తంగ మగన్. దీన్ని ‘నవ మన్మథుడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు ఎన్. వెంకటేశ్, ఎన్. రవికాంత్. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ధనుష్ ఏ సినిమా చేసినా విలక్షణంగానే ఉంటుంది. ఈ చిత్రం కూడా ఆ జాబితాలోకి చేరుతుంది. అనిరుధ్ స్వరాలు, సమంత, ఎమీ జాక్సన్‌ల అందచందాలు, అభినయం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు’’ అని తెలిపారు.