యాక్షన్ సన్నివేశాల్లో నయన్ | Nayan in Action scenes | Sakshi
Sakshi News home page

యాక్షన్ సన్నివేశాల్లో నయన్

Published Tue, Nov 15 2016 2:24 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

యాక్షన్ సన్నివేశాల్లో నయన్ - Sakshi

యాక్షన్ సన్నివేశాల్లో నయన్

నయనతార యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. గ్లామరస్ పాత్రల నుంచి కేరీర్‌ను ప్రారంభించిన ఈ మలయాళీ బ్యూటీ గజిని, వల్లవన్ చిత్రాలలో నయనతార అందాలకు యువత గులామ్ అయ్యారనే చెప్పాలి. అలా తెలుగు చిత్రం శ్రీరామరాజ్యం ముందువరకూ తన గ్లామర్ హవా కొనసాగిందనే చెప్పాలి. శ్రీరామరాజ్యం నయనతారలో పెద్ద మార్పునకు దారి తీసిందనే చెప్పాలి. ఆ తరువాత ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుని నటించడం మొదలెట్టారని చెప్పవచ్చు. అలా లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం అన్బే నీఎంగే చిత్రంలో నటించినా ఆ చిత్రం నయనకు పెద్దగా ప్లస్ అవ్వలేదు. ఆ తరువాత నటించిన హారర్ కథా చిత్రం మాయ నయనతారకు సూపర్ హీరోయిన్ అంతస్తును అందించింది.

ఆ తరువాత ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఇక హీరోల చిత్రాల్లో నటించినా తన పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారు. కాగా తాజాగా యాక్షన్ అవతారమెత్తడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు విశ్వనటుడు కమలహాసన్ హీరోగా ఉన్నైపోల్ ఒరువన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అరుు్య మంచి పేరు తెచ్చుకున్న చక్రీ తోలేటి ఆ తరువాత అజిత్ కథానాయకుడిగా బిల్లా-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆయన్ని నిరాశపరిచిందనే చెప్పాలి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న చక్రీ తోలేటి ఇప్పుడు నయనతారతో యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అరుునట్లు తెలిసింది. ఈ చిత్రంలో చాలా రిస్కీ యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయట. ప్రస్తుతం శివకార్తీకేయన్‌తో నటిస్తున్న చిత్రం తరువాత నయనతార చక్రీ తోలేటి దర్శకతంలో యాక్షన్ అవతారమెత్తనున్నారని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement