డూ ఆర్‌ డై! | Nee Prema Kosam Movie Audio Launch | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 12:57 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Nee Prema Kosam Movie Audio Launch - Sakshi

రాధ బంగారు

జొన్న పరమేష్, రాధ బంగారు జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నీ ప్రేమ కోసం’. ‘డూ ఆర్‌ డై’ అన్నది ఉపశీర్షిక. ఉలి దర్శకత్వంలో సరోవర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఉప్పుల గంగాధర్‌ నిర్మిస్తున్నారు.  కె.లక్ష్మణ సాయి స్వరపరచిన ఈ చిత్రం పాటలను విడుదల చేశారు. దర్శకుడు ఉలి మాట్లాడుతూ– ‘‘రొటీన్‌ లవ్‌ స్టోరీలకు భిన్నంగా ఉండే చిత్రమిది. ప్రపంచ శాంతి సందేశంలో అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా నిలుస్తుంది. చిత్ర కథకు, ‘డూ ఆర్‌ డై’ ఉపశీర్షికకు సంబంధం ఏంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ కథను సవాల్‌గా తీసుకుని తెరకెక్కించా. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నిజ జీవితంలోని వ్యక్తుల పాత్రలు మా సినిమాలో కనిపిస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, బాధలు ఉంటాయి. వాటిని మా దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తాయని ఆశిస్తున్నా’’ అన్నారు సహ నిర్మాత గోలి వెంకటరమణ. నంబి వేణుగోపాలాచార్య కౌశిక, సింహరాజు కోదండ రాములు,  శ్రీ మంజునాథ విజయ్‌బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: మాస్టర్‌ గోవింద్‌ బోగోజు, కెమెరా: వేమూరి చంద్రశేఖర్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement