ఇప్పటికైనా నిజం తెలుసుకుంటుందా..? | negative talk for kangana ranuths katti batti | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా నిజం తెలుసుకుంటుందా..?

Published Sun, Sep 20 2015 8:12 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

ఇప్పటికైనా నిజం తెలుసుకుంటుందా..? - Sakshi

ఇప్పటికైనా నిజం తెలుసుకుంటుందా..?

ఇటీవల వరుస బ్లాక్ బస్టర్స్తో బాలీవుడ్లో సత్తా చాటుతున్న కంగనా రనౌత్కు గట్టి షాక్ తగిలింది. క్వీన్, తనువెడ్స్ మను రిటర్న్స్ లాంటి హిట్స్తో జోరు చూపించిన ఈ బ్యూటి, స్టార్ హీరోల మీద కూడా వరుస కామెంట్స్తో నిత్యం వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా తను స్టార్ హీరోల సరసన నటించనంటూ తనకే ఓ సూపర్ స్టార్కు ఉన్న ఫాలోయింగ్ ఉందంటూ చేసిన కామెంట్లు సినీ వర్గాలతో పాటు అభిమానులకు కూడా కోపం తెప్పించాయి.

తన సినిమాలు వంద కోట్ల వసూళ్లు సాధించడం రివాజుగా మారిందన్న కంగనా, తాజా సినిమా కట్టి బట్టితో షాక్ అయ్యింది. నిఖిల్ అద్వాని దర్శకత్వంలో ఇమ్రాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో మినిమమ్ కలెక్షన్లు కూడా వసూళు చేసే పరిస్థితి కనిపించటం లేదు. కంగన తప్ప ఆడియన్స్ను థియేటర్ల వరకు రప్పించే అంశాలేవి లేకపోవటంతో ఓపెనింగ్స్ విషయంలో కూడా కట్టిబట్టి తీవ్రంగా నిరాశపరిచింది.

కట్టిబట్టి మినిమమ్ బడ్జెట్తోనే రూపొందినా ఆ వసూళ్లు కూడా కష్టంగానే కనిపిస్తున్నాయి. అదే స్టార్ హీరో సినిమా అయి ఉంటే టాక్ ఎలా ఉన్న తొలిరోజు కలెక్షన్లతో నిర్మాత సేఫ్ అయ్యేవాడన్న టాక్ వినిపిస్తుంది. దీంతో కంగనాకు స్టార్ హీరోలసినిమాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటో ఇప్పటికైన అర్థమవుతుందంటున్నారు బాలీవుడ్ జనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement