నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా..! | Kangana Ranaut wants to experience true love | Sakshi
Sakshi News home page

నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా..!

Published Fri, Aug 28 2015 9:46 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా..! - Sakshi

నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా..!

వరుస బ్లాక్ బస్టర్స్తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న కంగనా రనౌత్ తన తదుపరి సినిమా 'కట్టి బట్టి' ప్రమోషన్లో స్పీడు పెంచింది.  పబ్లిక్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ అభిమానులను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. సహ నటుడు ఇమ్రాన్ ఖాన్తో కలిసి సినిమాను భారీగా ప్రమోట్ చేస్తుంది.

ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఈ బాక్సాఫీస్ క్వీన్. తన జీవితంలో ఇంత వరకు ట్రూ లవ్ అనేది పొందలేదన్న కంగనా, సినిమా విషయంలో మాత్రం ఆ ఫీలింగ్ పర్ఫెక్ట్ గా ఉందని తెలిపింది. రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయంటుంది. ముఖ్యంగా లవ్, రొమాంటిక్ సీన్స్... సినిమాకు చాలా ప్లస్ అవుతాయని ధీమాగా ఉంది.

ప్రస్తుతం వస్తున్న న్యూస్, ప్రొమోస్ కి మించి సినిమాలో చాలా సర్పైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయంటూ అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తుంది. నిఖిల్ అద్వాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కట్టి బట్టి' సినిమాలో పాయల్ అనే ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తుంది కంగనా. జీవితాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్న ఓ అమ్మాయి ఒక్కసారిగా పరిస్థితులు తారు మారు కావటంతో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది అన్నదే సినిమా కథ.

ఇప్పటికే రెండుసార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ బోల్డ్ బ్యూటీ  'కట్టి బట్టి'తో మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో కంగనతో స్క్రీన్ పంచుకున్న ఇమ్రాన్ ఖాన్ కూడా  ఆమె పర్ఫెమెన్స్ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. దీంతో మరోసారి కంగన వందకోట్ల క్లబ్లో చేరటం ఖాయం అంటున్నారు బాలీవుడ్ మూవీ లవర్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement