బ్రేకింగ్‌ న్యూస్‌ | new movie Breaking news | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌ న్యూస్‌

Published Sat, Jul 29 2017 12:33 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

బ్రేకింగ్‌ న్యూస్‌ - Sakshi

బ్రేకింగ్‌ న్యూస్‌

తొలి సినిమా ‘1940లో ఒక గ్రామం’తో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌’. ‘జబర్దస్త్‌’ అభి, సందీప్తి, ఫణి ‘జబర్దస్త్‌’, వరుణ్‌ కీలక పాత్రల్లో బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కానుంది. నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఇది వినూత్న తరహా చిత్రం.

గేదెను హీరోగా చేస్తూ దాని ప్రాధాన్యతను ఈ సినిమాలో చూపిస్తున్నాం. మా సినిమా చూశాక జంతువులు, పక్షుల పట్ల ప్రేమగా, బాధ్యతగా ఉంటారు’’ అన్నారు. ‘‘కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్‌ ఉన్న చిత్రమిది. పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు సుక్కు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పీఎల్‌కే రెడ్డి, పాశం వెంకటే శ్వర్లు, బజాజ్‌ బుజ్జి, ఆలేటి శ్రీనివాసరావు, బద్ధల హరిబాబు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: కులకలూరి రవిబాబు, రఫి, డేవిడ్‌ జేమ్స్, కెమెరా: మురళీమోహన్‌ రెడ్డి, పాటలు: డా. చల్లా భాగ్యలక్ష్మి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement