ఆ రోడ్డులో ఏం జరిగింది?
సాయిరామ్ శంకర్, నికిషా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అరకు రోడ్‌లో’. వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, నక్కా రామేశ్వరిలు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో పాటల్ని, అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. అరకు రోడ్‌లో ఏం జరిగింది? అనేది ఉత్కంఠ కలిగిస్తుంది. అరకు రోడ్డులో ఎన్ని మలుపులు ఉన్నాయో సినిమా కూడా అన్ని మలుపులు తిరుగుతుంది’’ అన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: చీకటి జగదీశ్, సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్.