థ్రిల్లర్ కార్తికేయ...
‘‘ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏదీ ఉండదు. ఒక వేళ సమధానం దొరకలేదూ అంటే ఆ లోపం ప్రశ్నది కాదు... ప్రయత్నానిదే అని నమ్మే ఓ యువకునికి ఎదురైన సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న చిత్రం ‘కార్తికేయ’. ‘స్వామి రారా’ చిత్రంతో యువతరాన్ని ఆకట్టుకున్న జంట నిఖిల్, స్వాతి ఈ చిత్రంతో రెండోసారి జతకట్టారు. చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ -‘‘తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా తొలి ప్రయత్నమే ద్విభాషా చిత్రం కావడం ఆనందంగా ఉంది.
నిఖిల్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. జనవరిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో హీరోహీరోయిన్లు వైద్య విద్యార్థులుగా కనిపిస్తారని, థ్రిల్లింగ్‌గా సాగే వినోదాత్మక చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు. తనికెళ్ల భరణి, నాజర్, రావురమేష్, జోగినాయుడు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్, సంగీతం: శేఖర్‌చంద్ర, పాటలు: కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గునకల మల్లికార్జున.