థ్రిల్లర్ కార్తికేయ
థ్రిల్లర్ కార్తికేయ
Published Sun, Sep 1 2013 12:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయం ‘స్వామి రారా’. ఆ సినిమాలో నిఖిల్, స్వాతి జంట యువతరాన్ని విశేషంగా అలరించిందనే చెప్పాలి. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘కార్తీకేయ’. చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు. ఒకవేళ సమాధానం దొరక్కపోతే... ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే ఓ యువకుని జీవితంలో ఎదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్ర కథ. ఇందులో నిఖిల్, స్వాతి వైద్య విద్యార్థులుగా నటిస్తున్నారు.
థ్రిల్లర్ కథాంశమిది’’ అని చెప్పారు. ‘‘నిఖిల్ చిత్రాల్లో ఇది హైబడ్జెట్ మూవీ. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. తనికెళ్ల భరణి, నాజర్, రావురమేష్, ప్రవీణ్, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్‌చంద్ర, కూర్పు: కార్తీక శ్రీనివాస్, పాటలు: కృష్ణచైతన్య, కార్యనిర్వాహక నిర్మాత: గునకల మల్లికార్జున్, సమర్పణ: శిరువూరి రాజేష్‌వర్మ.
Advertisement
Advertisement