'ఎవరు చెప్పారు? న్యూడ్ సీన్లు లేవు'
ముంబయి: మధుర్ బండార్కర్ కొత్త చిత్రం క్యాలెండర్ గర్ల్స్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఆయన చిత్రంలో న్యూడ్ (అశ్లీల) సన్ని వేశాలు ఉన్నాయని, అయితే, ఆ విషయం వివాదం అవుతుందని తెలుసుకొని జాగ్రత్తగా తొలి ట్రైలర్ నుంచి కట్ చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఈ విషయంపై మధుర్ బండార్కర్ వెంటనే స్పందించారు.
అలాంటి సన్ని వేశాలు తన చిత్రంలో లేనే లేవని అన్నారు. 'అసలు ఈ వార్తలు ఎవరు చెప్పారో నాకు అస్సలు తెలియదు. కానీ ఒకసారి సినిమా విడుదలయ్యాక మీరే తెలుసుకుంటారు.. ఆ చిత్రంలో అలాంటి సన్ని వేశాలు లేవని' అని ఆయన అన్నారు. చిత్ర బృందం కూడా అవన్నీ పుకార్లేనని కొట్టి పారేశారు.