గోల్డెన్ లెగ్గే కాదు గోల్డెన్ హార్ట్ కూడా..! | Not only Golden Leg.. Golden Heart too | Sakshi
Sakshi News home page

గోల్డెన్ లెగ్గే కాదు గోల్డెన్ హార్ట్ కూడా..!

Published Tue, Sep 3 2013 12:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

గోల్డెన్ లెగ్గే కాదు గోల్డెన్ హార్ట్ కూడా..!

గోల్డెన్ లెగ్గే కాదు గోల్డెన్ హార్ట్ కూడా..!

 సమంత ‘గోల్డెన్ లెగ్’..’ పరిశ్రమలో అందరూ అనే మాట ఇది. అయితే... తన పాదమే కాదు... తన మనసూ బంగారమేనని రుజువు చేసుకున్నారు సమంత. ప్రత్యూష ఫౌండేషన్ ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే అటు అభిమానులకు, ఇటు సాటి తారలకు స్పూర్తిగా నిలిచారామె. ట్విట్టర్ ద్వారా సమంత సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న అభిమానులు... తాము ఆ ఫౌండేషన్‌కి విరాళాలందిస్తామని చెన్నయ్‌లోని సమంత నివాసానికి పోటెత్తారు. 
 
 ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా సమంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే... ఇటీవల సమంత చేసిన సాయం, పలువురు మనసుల్ని కదిలించింది. వివరాల్లోకెళితే... హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో అవయవాలు కోల్పోయిన అభాగ్యులెందరో. వారిని తనకు చేతనైనమేర ఆదుకుంటానని ఆ మధ్య మీడియా సాక్షిగా చెప్పారు సమంత.
 
 అన్నమాటను నిలబెట్టుకుంటూ... ఇటీవలే దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో కాలుని కోల్పోయిన రజిత అనే అమ్మాయికి కృత్రిమ కాలుని అమర్చడానికి రెండు లక్షల ముప్ఫై వేల రూపాయలు అందించారామె. ఈ ఘోర సంఘటనలో బాధితులుగా నిలిచిన మిగిలిన వారిని కూడా ఆదుకోవడానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా సమంత తెలిపారు. ఇంత మంచి మనసు ఎంత మంది కథానాయికలకు ఉంది చెప్పండి?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement