లండన్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25వ చిత్రం ఎట్టకేలకు సోమవారం సెట్స్ మీదకు వెళ్లింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం లండన్లో ప్రారంభం కానుండటం ఎంతో సంతోషంగా ఉన్నానని రకుల్ నిన్న ట్విట్టర్లో ట్విట్ చేసింది.
ఈ చిత్రంలో సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి తండ్రి పాత్ర పోషించనున్నారు. పలు సినిమాల్లో ఇప్పటికే హీరోలకు తండ్రిగా నటించిన ఆయన ఈసారి ఎన్టీఆర్కు తండ్రిగా నటించబోతున్నారు. ముందుగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్రని మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేస్తారని అనుకున్నారు. అయితే చివరకు ఆ పాత్ర చేసే అవకాశం రాజేంద్ర ప్రసాద్కి దక్కింది.
తండ్రి, కొడుకుల మధ్య ఉన్న అనుబంధంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్కు తండ్రిగా జగపతి బాబు నెగటివ్ రోల్ చేయబోతున్నారు. షూటింగ్ నవంబర్ చివరికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ను బ్రిటన్లో మరికొన్ని కీలక సన్నివేశాలను ఆస్ట్రేలియాలో చిత్రీకరించనున్నారు. ఈసినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.
లండన్ లో ఎన్టీఆర్ 25వ చిత్రం
Published Mon, Jul 6 2015 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM
Advertisement
Advertisement