సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలో మరో భారీ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే 25వ సినిమా షూటింగ్ జరుగుతుండగానే నెక్ట్స్ చేయబోయే సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు సూపర్ స్టార్. తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేసేందుకు ఓకె చెప్పాడు.
రంగస్థలం సక్సెస్ తో సూపర్ ఫాంలో ఉన్న సుకుమార్, మహేష్ కోసం ఆసక్తికర కథను సిద్ధం చేశారట. ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న మహేష్ 25 పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమా పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. స్పైడర్ షూటింగ్ సమయంలోనే రకుల్ మరో ఛాన్స్ ఇస్తానని మహేష్ మాట ఇచ్చాడట. ఇచ్చిన మాట ప్రకారం సుకుమార్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment