మే నుంచి మహేష్‌బాబుతో కమర్షియల్‌ సినిమా | Sukumar Mahesh babu Movie Starts In May | Sakshi
Sakshi News home page

మే నుంచి మహేష్‌బాబుతో కమర్షియల్‌ సినిమా

Published Tue, Jan 15 2019 8:17 AM | Last Updated on Tue, Jan 15 2019 8:17 AM

Sukumar Mahesh babu Movie Starts In May - Sakshi

భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులు, చిన్ననాటి గురువులతో సంక్రాంతి వేడుకల్లో సినీ దర్శకుడు సుకుమార్‌

తూర్పుగోదావరి, మలికిపురం (రాజోలు): మైత్రీ మూవీస్‌ బేనర్‌లో మే నెల నుంచి సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని దర్శకుడు సుకుమార్‌ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా స్వస్థలమైన మలికిపురం మండలం మట్టపర్రు వచ్చిన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. పూర్తి కమర్షియల్‌గా ఉండే ఈ సినిమాలో మహేష్‌బాబును కొత్త గెటప్‌లో చూపిస్తామన్నారు. హీరోయిన్‌ ఇతర నటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుందన్నారు.

గీతా ఆర్ట్స్, మైత్రీ సంస్థలతో కలిసి సొంత బ్యానర్‌లో శౌర్య హీరోగా కాశిరెడ్డి దర్శకత్వంలో ఒకటి, నితిన్‌ హీరోగా ప్రతాప్‌ దర్శకత్వంలో మరొకటి, అలాగే ఉప్పాడకు చెందిన బుచ్చిబాబును దర్శకునిగా పరిచయం చేస్తూ సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా మరో సినిమా ఈ ఏడాది చేస్తున్నట్లు సుకుమార్‌ తెలిపారు. బయోపిక్‌ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు. ఒక హిస్టారికల్‌ చిత్రం చేయాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సుకుమార్‌ చెప్పారు.

బంధువులు, స్నేహితులతో పండగ
పండగ సందర్భంగా స్వస్థలం మట్టపర్రులో బంధువులు, స్నేహితులతో సుకుమార్‌ ఆనందంగా గడిపారు. స్నేహితులు లింగోలు బాబు, కటికిరెడ్డి మహేష్, కంచి సూర్యనారాయణ, చెల్లుబోయిన కృష్ణ తదితరులు సుకుమార్‌కు స్వీట్లు తినిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement