
బ్రేక్ తీసుకోకుండా విలన్స్ బోన్స్ బ్రేక్ చేస్తున్నారట ఎన్టీఆర్. కొత్త బుజ్జాయితో ఆడుకోకుండా.. విలన్స్‌ను రఫ్ ఆడిస్తున్నారట. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై యస్. రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో రాయలసీమ కుర్రాడిగా రాయలసీమ డైలాగ్స్ కూడా పలుకబోతున్నారు ఎన్టీఆర్.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఓ ఫైట్‌ని షూట్ చేస్తోంది చిత్రబృందం. ఈ ఫైట్‌లోనే విలన్స్‌ని దుమ్ము దులిపేస్తున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. అందుకే బ్రేక్ లేకుండా ఫుల్ స్పీడ్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: పీయస్ వినోద్.