ఒడియన్‌ మ్యాజిక్‌ | Odiyan movie teaser release | Sakshi
Sakshi News home page

ఒడియన్‌ మ్యాజిక్‌

Published Sun, Jul 15 2018 1:21 AM | Last Updated on Sun, Jul 15 2018 1:21 AM

Odiyan movie teaser release - Sakshi

మోహన్‌లాల్‌

నాలుగు నెలలు ముగిసిపోయాయి ‘ఒడియన్‌’ మూవీ షూటింగ్‌ను మోహన్‌లాల్‌ కంప్లీట్‌ చేసి. ఇప్పుడు ఈ సినిమా లేటెస్ట్‌ టీజర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ను రీసెంట్‌గా అనౌన్స్‌ చేసింది చిత్రబృందం. అన్నట్లు మోహన్‌లాల్‌ సడన్‌గా దాదాపు 18 కేజీలు తగ్గి స్లిమ్‌ ఫిట్‌లోకి మారిపోయింది ఈ సినిమా కోసమే. మోహన్‌లాల్, మంజు వారియర్, ప్రకాశ్‌ రాజ్‌ ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘ఒడియన్‌’. ఈ సినిమా ద్వారా వీఏ శశి కుమార్‌ మీనన్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

‘ఒడియన్‌ కాదు.. ఒడియన్‌ మాణిక్యన్‌ చేయబోయే ట్రిక్స్‌ చూడబోతున్నారు’ అని ఈ టీజర్‌లో ఉంటుంది. ఒకప్పుడు కేరళలోని పాలక్కాడ్‌– మలబార్‌ తీరంలో ఉన్న ఒడియన్‌ ట్రైబల్స్‌కి చెందిన వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని టాక్‌. ‘ఒడియన్‌’ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌ 11న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా హీరోగా ‘డ్రామా, మరార్కర్‌’ సినిమాలు చేస్తున్నారు మోహన్‌లాల్‌. ప్రస్తుతం సూర్య హీరోగా కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement