Odiyan
-
ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డులు స్ఫూర్తిదాయకం
సాక్షి, సిటీ బ్యూరో : వ్యాపారం, సాంకేతికత, కళలు, సామాజిక సేవతో పాటు విభిన్న రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలను ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ (టీఓటీ) ఆధ్వర్యంలో ‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ –2025’ అవార్డులతో గౌరవించింది. హైటెక్ సిటీలోని అవసా హోటల్ వేదిక జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, వెల్నెస్ అంబాసిడర్ శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు అవార్డులను అందించారు. ఈ వేదిక ద్వారా మహిళల ప్రయాణాన్ని స్ఫూర్తివంతమైన కథలుగా ప్రదర్శించామని ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ వ్యవస్థాపకులు మహమ్మద్ ఫయాజ్ తెలిపారు. అవార్డుల జ్యూరీలో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ఇండియా సీఈవో శిరీష వోరుగంటి, వీహబ్ సీఈవో సీతా పల్లచోల్ల, ఐబీఎం ఎగ్జిక్యూటివ్ భాగస్వామి అనురాధ ఏ, నోవార్టిస్ కంట్రీ హెడ్ దివ్య బాల్‌రాజ్, తెలంగాణ తొలి గిరిజన మహిళా వాణిజ్య పైలట్ కెప్టెన్ బాబీ ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధిపతి మనీషా సాబూ, అబైరో క్యాపిటల్ సలహాదారు మహంకాళి శ్రీనివాసరావు, ఎడ్యు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫిరోజ్ సైట్ పాల్గొన్నారు. నగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ ‘పత్ ఉత్సవాలకు’ వేదికైన ఖాజాగూడ పెద్ద చెరువు రాయదుర్గం : ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ‘పత్ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. మొదట ఇస్కాన్ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్ ఆర్ట్స్ డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక ఆహా్వనితులుగా ఐపీఎస్ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ రగ్బీ జాతీయ స్థాయి సభ్యత్వం ఇండియన్ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి తెలంగాణ అసోసియేషన్‌కు సభ్యత్వం అధికారికంగా ప్రకటించిన ఐఆర్ఎఫ్యుతెలంగాణలో బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ తరహాలో రగ్బీ క్రీడ కూడా అభివృద్ధి చెందనుందని తెలంగాణ రగ్బీ అసోసియేషన్ వెల్లడించింది. ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి శాశ్వత సభ్యత్వం కోసం అధికారికంగా గుర్తింపు లభించిందని సంస్థ ప్రకటించింది. ఈ నూతన అనుబంధంతో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’ కింద శాశ్వత సభ్యులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలనూ అందించనున్నట్లు నూతన అధ్యక్షులు, లైఫ్‌స్పాన్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ నరేంద్ర రామ్ తెలిపారు. ఈ అధికారిక గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీని మెరుగుపరచడానికి, జాతీయ పాలక సంస్థతో సన్నిహితంగా సహకరించడానికి అసోసియేషన్ అనుమతిస్తుందని పేర్కొన్నారు. నూతన అధ్యక్షునిగా 2028 వరకూ మూడేళ్ల పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే శక్తివంతమైన రగ్బీ సంఘాన్ని సృష్టించడానికి కలిసి పనిచేయనున్నామని తెలిపారు. ఆకట్టుకున్న మార్షల్ ఆర్ట్స్ వైశాఖీ ఉత్సవాల సందర్భంగా సాయంత్రం నగర కీర్తన్ పేరిట ఊరేగింపు నిర్వహించారు. అమీర్‌పేట గురుద్వారా నుంచి ప్రారంభమైన ఊరేగింపు గ్రీన్‌ల్యాండ్స్, క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట, అమీర్‌పేట మీదుగా గురుగ్రంథాన్ని, సిక్కు సంప్రదాయ ఆయుధాలను ప్రదర్శనంగా ఊరేగింపు నిర్వహించారు. సిక్కు యువతీ, యువకులు చేసిన మార్షల్ ఆర్ట్స్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురుగోవింద్‌సింగ్ వంశపారంపర్యంగా వస్తున్న ఐదు అరుదైన గుర్రాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా గురుగ్రంథానికి పూజలు చేశారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సినిమా తీస్తానని రూ.7 కోట్లు మోసం.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్!
ప్రముఖ మలయాళీ దర్శకుడు, యాడ్ ఫిలిమ్ మేకర్ వీఏ శ్రీకుమార్ మీనన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా చేస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ శ్రీవాసలం బిజినెస్ గ్రూప్‌కి చెందిన రాజేంద్రన్ పిళ్లై ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకుమార్‌ని అరెస్ట్ చేసి గురువారం కోర్డులో హాజరుపరిచారు. అతనిపై సెక్షన్ 406, సెక్షన్ 420ల కింద యాక్షన్ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే అంతకు ముందే శ్రీకుమార్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. దాన్ని కోర్టు తిరస్కరించింది. శ్రీకుమార్ అరెస్ట్ కావడం ఇది మొదటిసారి కాదు. ప్రముఖ నటి మంజు వారియర్‌ను బెదిరించి, పరువునష్టం కలిగించారన్న ఆరోపణలపై 2019లో శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు మంజు వారియర్.. శ్రీకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఓడియన్‌లో హీరోయిన్గా చేసింది. అంతేకాదు.. అతనితో కలిసి పలు యాడ్లలో కూడా ఆమె నటించింది. -
అప్పుడు జింకలా మారతా!
మోహన్‌లాల్... నటుడిగా 41 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. వయసేమో 58కి పైనే. పాత్ర ప్రేమగా అడిగితే పాతికేళ్ల యువకుడిగానూ మారిపోతారు. భాష తెలియదంటే నేర్చుకుని మరీ నటిస్తారు. అభిమానులు అభిమానంగా ‘కంప్లీట్ యాక్టర్’ అని పిలుచుకుంటారు. నా సినిమాలు, నా దర్శకులే ఆ కంప్లీట్నెస్కి కారణం అని మోహన్‌లాల్ అంటారు. మోహన్‌లాల్ హీరోగా వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒడియన్’. ప్రకాష్‌రాజ్, మంజు వారియర్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా మోహన్‌లాల్ పంచుకున్న పలు విశేషాలు.... ► ‘ఒడియన్’ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తోంది? కేరళ నుంచి మంచి స్పందన వస్తోంది. మంచి ఒపెనింగ్స్ వస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా వస్తోందని అనుకుంటున్నాను. ఒక నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ► శ్రీకుమార్మీనన్కు దర్శకునిగా పెద్దగా అనుభవం లేదు. ఆయన ఇంత పెద్ద సినిమాను తీయగలరని ఎలా నమ్మారు? శ్రీకుమార్ మీనన్ ఫీచర్ ఫిల్మ్ ఏదీ తీయకపోయినా అతను చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాడు. నాతో కూడా కొన్ని యాడ్స్ చేశాడు. తను చేయగలడనే నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. ► ‘ఒడియన్’ కోసం ఎలాంటి పరిశోధన చేశారు? ప్రత్యేకంగా ఏ పరిశోధన చేయలేదు. కానీ సినిమా కోసం కష్టపడ్డాం. కాన్సెప్ట్ గురించి బాగా ఆలోచించాం. ఇది యాక్షన్ సినిమా కాదు. ఎమోషనల్ సినిమా. స్పిరిచ్యువల్ డెస్టినేషన్ ఉంది. ఎద్దు, పులి.. ఇలా ఎలా కావాలంటే ఆ విధంగా మారిపోయే శక్తులు ఉన్న ఒడియన్ అనే వ్యక్తి కథ. ► సినిమాలో ఎలా కావాలనుకుంటే అలా మారిపోతారు. ఒకవేళ నిజంగా అలా మారిపోవాలనుకుంటే? (నవ్వేస్తూ).. సినిమాలో చేసినట్టు మారే విషయం గురించి నేను ఆలోచించలేదు. అది మిలియన్ డాలర్ ప్రశ్న. (కాసేపు మౌనం) జింకలా మారతాను. ► నటుడిగా 41 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంత సుదీర్ఘ కెరీర్‌కు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇంత సుదీర్ఘ ప్రయాణం ఆశీర్వాదం అని నమ్ముతాను. నేను ఇలా చేశాను. అలా చేశాను.. దాని వల్లే ఇలా కొనసాగుతున్నాను అనుకోను. మంచి పాత్రలు లభించాయి. మంచి దర్శకులతో పని చేశాను. ఇవన్నీ నన్ను నిలబెట్టాయి. ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు, ఇండస్ట్రీకు థ్యాంక్స్. ► ఈ ఏజ్‌లో కూడా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు? రిస్క్ అనిపించడంలేదా? యాక్షన్ సినిమాలంటే నాకు ఇష్టం. నా కెరీర్లో ఎన్నో యాక్షన్ సినిమాలు చేశాను. రీసెంట్గా ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యంపులి’) చేశాను. అందులో పులులతో యాక్షన్ ఉంటుంది. ‘ఒడియన్’ క్యారెక్టర్ యాక్షన్ సన్నివేశాలను చేసి తీరాలి.. లేదా సినిమా చేయలేనని చెప్పాలి. యాక్షన్ సినిమాలు నేను చేయలేను అని నాకు అనిపించినప్పుడు తప్పకుండా ఆపేస్తాను. కానీ ఇప్పుడు చేయగలనన్న నమ్మకం ఉంది. సో.. చేస్తూనే ఉంటాను. ► ఈ మధ్య భాషా బేధాలు తొలగిపోయాయి అనిపిస్తోంది. అన్ని భాషల సినిమాలను అందరూ చూస్తున్నారు... కేరళలో ఇతర భాషల సినిమాలకు ఆదరణ ఉంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్స్ కూడా పెరిగాయి. నా కెరీర్ స్టార్టింగ్‌లో కేరళలో ఇతర భాషల సినిమాలు కూడా అనువాదం అయి విడుదలయ్యేవి. చిరంజీవిగారి సినిమాలు వచ్చేవి. బాగా ఆడేవి. ఈ మధ్య ఆ హద్దులు పూర్తిగా తొలగిపోయాయి అనిపిస్తోంది. ► తెలియని భాషలో నటించనని కొన్ని సందర్భాల్లో చెప్పారు. తెలుగులో నటిస్తున్నారు కదా? అవును. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు భాష పై కమాండ్ ఉంటే నటించడం సులభంగా ఉంటుంది. కొంచెం ఫ్రీగా ఉంటుంది. క్యారెక్టర్‌పై కమాండ్ కూడా వస్తుంది. యాక్ట్ చేసేటప్పుడు ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. ఇప్పుడు మాట్లాడమంటే మలయాళంలో అనర్గళంగా మాట్లాడతాను. కానీ తెలుగులో సినిమా చేసేప్పుడు డైలాగ్‌లు మాత్రమే చెప్పగలం. అంతవరకూ అయినా కమాండ్ ఉంది కాబట్టే చేస్తున్నాను. ► ఇటీవల మీరు వరుసగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేస్తున్నట్లున్నారు? ప్లాన్ చేయలేదు. అలా జరుగుతున్నాయి అంతే. అయినా ‘ఒడియన్’ హిస్టారికల్ ఫిల్మ్ కాదు. నివిన్ పౌలితో ‘కాయమ్‌కులమ్ కొచ్చిన్’ సినిమా చేశాను. అది హిస్టారికల్ మూవీ. ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరాక్కర్’ అనే హిస్టారికల్ మూవీ. చేస్తున్నాను. ► ఆర్టిస్టుల దాహం తీరదంటారు. మీ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని ‘కంప్లీట్ యాక్టర్’ అని సంబోధిస్తారు. మిమ్మల్ని మీరు కంప్లీట్ యాక్టర్‌గా భావిస్తారా? కంప్లీట్ యాక్టర్ అనేది ఫ్యాన్స్ పిలుచుకునేది. అలాంటి బిరుదులు ఇచ్చేశారని పరిపూర్ణంగా అయిపోయాం అనుకోకూడదు. లక్కీగా నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. దర్శకులు నా కోసం అలాంటి పాత్రలు ఇస్తుండటాన్ని బ్లెసింగ్‌గా భావిస్తున్నాను. ప్రేక్షకులు ఆదరించే ఆసక్తికరమైన సినిమాలు చేస్తున్నప్పుడు పేర్లు అవే వస్తాయి. నాకు ఫలానా పాత్రలు కావాలనుకుంటే రావు. వచ్చిన పాత్రలనే బాగా చేస్తున్నాను అంతే. ► ఈ వయసులోనూ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు? ఒక సినిమాను కంప్లీట్ చేసిన వెంటనే ఇంకో సినిమాను స్టార్ట్ చేస్తున్నాను. సినిమాలను ప్రేమిస్తాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను వర్క్‌హాలిక్‌ని (అతిగా పని చేసే వ్యక్తి) సెట్లో సీన్ ఎంత ఆలస్యం అయినా వెయిట్ చేయాలి. ఒక నటుడిగా దర్శక–నిర్మాతలకు మనం ఇచ్చే గౌరవం అది. నా వర్క్‌ని ఎంజాయ్ చేస్తాను. నీ పనిని నువ్వు ప్రేమించనప్పుడు అందులో ఎక్కువకాలం ఎలా కొనసాగుతావు? పనిని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని అనిపించినప్పుడు చేయకపోవడమే మంచిది. ► టాలీవుడ్‌తో మీకు ఉన్న అనుబంధం? ‘గాంఢీవం’ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేశాను. ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ చేశాను. ‘మనమంతా’ చేశాను. నా సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అవుతుంటాయి. అలాగే కొన్ని సినిమాలను రీమేక్ చేశారు. మోహన్‌బాబు, చిరంజీవిలతో మంచి రిలేషన్ ఉంది. వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఇంకొందరితో మంచి స్నేహం ఉంది. ► ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు పెరుగుతున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? హాలీవుడ్ సినిమాలు చూస్తుంటాం. ఎందుకు? భారీ బడ్జెట్, భారీ కాన్వాస్, లార్జర్ దాన్ లైఫ్‌లా ఆ సినిమాలు ఉంటాయని. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దొరుకుతుంది. మంచి మార్కెట్ క్రియేట్ అవుతంది. ఆ విషయాన్ని ‘బాహుబలి’ నిరూపించింది. ఇప్పుడు ‘మరాక్కర్’ అనే చిత్రం చేస్తున్నాం. బిగ్ బడ్జెట్ సినిమాలు తప్పనిసరిగా రావాలి. అవకాశం, సామర్థ్యం ఉన్నప్పుడు చేయడంలో తప్పు లేదు. ► మీ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. ప్రణవ్ చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేశాడు. ఫస్ట్ సినిమా ‘ఆది’లో హీరోగా బాగా నటించాడు. మంచి హిట్ అయింది. ఇప్పుడు రెండో సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ‘మరాక్కర్’లో నా చిన్ననాటి పాత్ర చేస్తున్నాడు. అయితే సినిమాల్లో కొనసాగలని ప్రణవ్ ఇంకా నిర్ణయించుకోలేదు. ఇంకో 3,4 సినిమాలు చేసి ఒక నిర్ణయానికి వస్తాడేమో. ► మమ్ముట్టి, మీ మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? మేము మంచి మిత్రులం. ఇద్దరం కలిసి దాదాపు 54 సినిమాలు చేశాం. ‘ఒడియన్’ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారాయన. ► మాలీవుడ్ యంగ్ హీరోలు (దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలి) కూడా తెలుగులో ఫ్యాన్స్ సంపాదించుకోవడంపై మీ ఒపీనియన్? మంచి మంచి పాత్రలు చేస్తూ వాళ్లను వారు నిరూపించుకుంటున్నారు. వారికి మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు రావాలని నేనూ కోరుకుంటున్నాను. ► ప్రస్తుతం మలయాళంలో ‘అమ్మ’ అసోసియేషన్‌లో నటుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దాని గురించి... అక్కడ ఏం జరిగిందో బయట వాళ్ళకు పూర్తిగా అవగాహన లేదు. అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒడియన్లో.. -
తెలుగులో తారక్.. తమిళ్లో రజనీ
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓడియన్. డిఫరెంట్ కాన్సప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో సౌత్ స్టార్‌గా ఎదిగి మోహన్‌లాల్ ఇప్పుడు తన సినిమాలన్నింటినీ తెలుగు, తమిళ్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా కు తెలుగులో ఎన్టీఆర్, తమిళ్లో రజనీకాంత్‌లు వాయిస్ అందించనున్నట్టుగా తెలుస్తోంది. పగలు ఒకలా రాత్రి ఒకలా ప్రవర్తించే వ్యక్తికథతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాజ్ రాజ్, మంజు వారియర్, ఇన్నేసెంట్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఒడియన్ మ్యాజిక్
నాలుగు నెలలు ముగిసిపోయాయి ‘ఒడియన్’ మూవీ షూటింగ్‌ను మోహన్‌లాల్ కంప్లీట్ చేసి. ఇప్పుడు ఈ సినిమా లేటెస్ట్ టీజర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను రీసెంట్గా అనౌన్స్ చేసింది చిత్రబృందం. అన్నట్లు మోహన్‌లాల్ సడన్‌గా దాదాపు 18 కేజీలు తగ్గి స్లిమ్ ఫిట్లోకి మారిపోయింది ఈ సినిమా కోసమే. మోహన్‌లాల్, మంజు వారియర్, ప్రకాశ్ రాజ్ ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘ఒడియన్’. ఈ సినిమా ద్వారా వీఏ శశి కుమార్ మీనన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘ఒడియన్ కాదు.. ఒడియన్ మాణిక్యన్ చేయబోయే ట్రిక్స్ చూడబోతున్నారు’ అని ఈ టీజర్లో ఉంటుంది. ఒకప్పుడు కేరళలోని పాలక్కాడ్– మలబార్ తీరంలో ఉన్న ఒడియన్ ట్రైబల్స్‌కి చెందిన వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని టాక్. ‘ఒడియన్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా హీరోగా ‘డ్రామా, మరార్కర్’ సినిమాలు చేస్తున్నారు మోహన్‌లాల్. ప్రస్తుతం సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారాయన. -
సమ్‌థింగ్ స్పెషల్
అస్సలు అనిపించదు. జస్ట్... గెస్ కూడా చేయలేం.. మోహన్‌లాల్ ఏజ్‌ని. అంతలా ఆయన ‘ఒడియన్’ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఆల్మోస్ట్ 20 కేజీల బరువు తగ్గారు. ఇంతగా కష్టపడి యంగ్ లుక్‌లోకి వచ్చారంటే.. సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఏదో ఉండే ఉంటుంది. అదేంటో సిల్వర్ స్క్రీన్‌పై చూడడానికి మరెంతో టైమ్ లేదు. ఎందుకంటే ‘ఒడియన్’ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్టారై్టపోయింది. మోహన్‌లాల్, మంజు వారియర్, ప్రకాశ్ రాజ్ ముఖ్య తారలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శివకుమార్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ఎంతో పేరు తెచ్చుకున్న ఆర్టిస్టులు ఓ కొత్త దర్శకుణ్ణి నమ్మి అవకాశం ఇచ్చారంటే కథలో మంచి దమ్ము ఉండి ఉంటుందని ఊహించవచ్చు. మేజికల్ థ్రిల్లర్‌గా 1950–2000 టైమ్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో మోహన్‌లాల్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా మరో లుక్‌ను రిలీజ్ చేశారు మోహన్‌లాల్. -
ఇద్దరు అగ్రనటులు 20 ఏళ్ల తర్వాత..
తిరువనంతపురం: అగ్రనటులు మోహన్‌లాల్, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోనుంది. చివరిసారిగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్వకత్వంలో ఇరవయ్యేళ్ల కిందట ప్రకాశ్‌రాజ్, మోహన్‌లాల్ కలిసి ‘ఇరువార్’ అనే చిత్రంలో నటించారు. పాలక్కాడ్ ప్రాంతంలో ఉండే గిరిజన తెగకు సంబంధించిన కథనంతో ‘ఒడియాన్’ టైటిల్‌తో రానున్న ఈ మలయాళ సినిమా ఓ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీలో మోహన్‌లాల్ సరసన మంజు వారియర్ నటించనున్నారు. తమిళం, తెలుగు భాషల్లోనూ మూవీ విడుదల చేస్తారు. అంతేకాదు, ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోలతో చర్చలు సాగుతున్నట్లు సమాచారం. కేరళ పాలక్కాడ్-మలబార్ ప్రాంతంలో ఉండే గిరిజన తెగకు సంబంధించిన కథనంతో ఈ సినిమా నడుస్తుంది. ఈ గిరిజనులకు మనుషులు, జంతువులు ఇలా ఏ రూపంలోకైనా మారే అద్భుత శక్తులుంటాయని.. ఇదివరకు ఎవరూ వినని కథనమని డైరెక్టర్ వీఏ శ్రీకుమార్ మీనన్ చెప్పారు. పాలక్కాడ్, థజారక్, పొల్లాచి, వారణాసి, హైదరాబాద్ ప్రాంతాలలో షూటింగ్ చేస్తామన్నారు. నవంబర్‌లో ఒడియాన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆశీర్వాద్ బ్యానర్లో మే 25 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు కథ రచయిత హరికృష్ణ కాగా, ఆంటోనీ పెరుంబువూర్ మూవీని నిర్మిస్తారని సమాచారం.