
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓడియన్. డిఫరెంట్ కాన్సప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో సౌత్ స్టార్‌గా ఎదిగి మోహన్‌లాల్ ఇప్పుడు తన సినిమాలన్నింటినీ తెలుగు, తమిళ్‌లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
డిసెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా కు తెలుగులో ఎన్టీఆర్, తమిళ్‌లో రజనీకాంత్‌లు వాయిస్ అందించనున్నట్టుగా తెలుస్తోంది. పగలు ఒకలా రాత్రి ఒకలా ప్రవర్తించే వ్యక్తికథతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాజ్ రాజ్, మంజు వారియర్, ఇన్నేసెంట్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment