
వారంలో 4 రోజులు మాత్రమే!
ఆలియా భట్ ఒకప్పుడు చాలా బొద్దుగా ఉండేవారు. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు తగ్గడం మొదలుపెట్టారు. వచ్చాక ఇంకా తగ్గారు. ఇప్పుడీ మెరుపు తీగ కుర్రకారు కలల రాణి. స్లిమ్‌గా ఉండటం కోసం ఆలియా రోజూ అదే పనిగా వర్కవుట్స్ చేస్తారనుకుంటే పొరపాటే. జస్ట్ నాలుగే నాలుగు రోజులు చేస్తారట. ‘‘నిద్రపోయే రెండు గంటల ముందే డిన్నర్ ముగించేయాలి. కేలరీలు కరిగించాలంటే కార్డియో ఎక్సర్‌సైజ్ బెస్ట్. ఆయిలీ, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి’’ అంటున్నారు ఆలియా. ఈ బ్యూటీ తీసుకునే డైట్, చేసే వర్కవుట్స్ గురించి తెలుసుకుందాం...
డైట్
స్వీట్స్ అంటే ఆలియాకి చాలా ఇష్టం. ఖీర్, బాసుంది బాగా తింటారు. అయితే వారంలో రెండు రోజులు మాత్రమే.
ఉదయం పంచదార లేని హెర్బల్ టీ తాగుతారు. ఆ తర్వాత కార్న్‌ఫ్లేక్స్ లేక అటుకులతో చేసిన ఉప్మా తింటారు. ఒక్కో రోజు రెండు ఎగ్ వైట్స్, ఏదైనా పండ్ల రసం తీసుకుంటారు. పండ్ల రసం తీసుకోని రోజున ఎగ్ వైట్స్‌తో పాటు గ్లాసుడు పాలతో బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చేస్తారు. అల్పాహారం తీసుకున్న రెండు గంటలకు ఏదైనా వెజిటెబుల్ సూప్ తాగుతారు, మధ్యాహ్నం రెండు లేక మూడు రోటీలు, పప్పు, ఉడకబెట్టిన కూరగాయలు కూడా తీసుకుంటారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పంచదార లేని టీ లేక కాఫీ తీసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ తింటారు. రాత్రి ఏడు గంటలకల్లా డిన్నర్ ముగించేస్తారు. ఒక కప్ వెజిటెబుల్ సలాడ్స్, ఒక కప్పు అన్నం, పప్పు లేకపోతే చికెన్ బ్రెస్ట్ తీసుకుంటారు. సలాడ్స్ తిననప్పుడు సూప్ తాగుతారు. వారంలో ఒక్క రోజు మాత్రం న్యూడుల్స్, బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్... ఇలా ఏది కావాలనుకుంటే అది తింటారు. అలాగే, ఆ ఒక్కరోజు శీతల పానీయాలు కూడా తీసుకుంటారు.
వర్కవుట్స్
సోమ, బుధ, శుక్ర, ఆదివారం.. ఈ నాలుగు రోజులు మాత్రమే వర్కవుట్స్‌కి కేటాయిస్తారు. మంగళ, గురు, శనివారాల్లో పొరపాటున వీటి జోలికి వెళ్లరు. ఒక్కోసారి ఆదివారం కూడా వర్కవుట్స్‌కి సెలవు చెప్పేస్తారు. రోజు మార్చి రోజు 30 నుంచి 40 నిమిషాల వరకూ కార్డియో ఎక్సర్‌సైజ్ చేస్తారు. కార్డియో చేయని రోజున డ్యాన్స్ చేస్తారు. కథక్ అంటే ఆలియాకు చాలా ఇష్టం. శరీరం దృఢంగా ఉండటం కోసం వెయిట్ ట్రైనింగ్ చేస్తారు.జిమ్‌లో వర్కవుట్స్ చేయని రోజున యోగా చేస్తారు. సూర్య నమస్కారాలతో పాటు స్ట్రెచింగ్ ఆసనాలు చేస్తారు.యోగా, జిమ్ చేయని రోజున స్మిమ్మింగ్ చేస్తారు. అప్పుడప్పుడు కిక్-బాక్సింగ్ చేస్తుంటారు. బాగా ఖాళీగా ఉంటే రన్ చేస్తారు. ఆలియా చాలా ఫాస్ట్ రన్నర్ అట!