
సాక్షి, హైదరాబాద్ : శ్రీదేవి అకాల మరణం పట్ల పాకిస్తాన్ క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. ఆమె అకాల మరణం మమ్మల్ని షాక్‌కు గురిచేసిందని పాక్ మాజీ క్రికెటర్లు వకార్ యూనిస్, షోయబ్ అక్తర్‌లు ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘శ్రీదేవి మరణవార్తతో షాక్‌కు గురయ్యాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్తూర్తిగా ప్రార్ధిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’ అని మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ట్వీట్ చేశారు. ‘శ్రీదేవి మరణ వార్త విని దిగులు చెందా.. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పేర్కొన్నారు.
We are deeply saddened by the news of Sridevi’s passing. Our thoughts and prayers are with the family #RIP
— waqar younis (@waqyounis99) 25 February 2018
Saddened by her sudden demise!
— Shoaib Akhtar (@shoaib100mph) 25 February 2018
RIP #Sridevi
Comments
Please login to add a commentAdd a comment