
అద్భుతాలు జరగబోతున్నాయ్ : హీరోయిన్
కాటమరాయుడు సినిమా రిలీజ్ తరువాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా పవన్ తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించేశాడు. ముందుగా చెప్పినట్టుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితం పూజ కార్యక్రమాలు జరుపుకోగా, సోమవారం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజు షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా హీరోయిన్ గా నటిస్తున్న అను ఇమ్మాన్యూయెల్ షూటింగ్ కు హాజరైంది.
ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసిన అను తొలిసారిగా పవన్ లాంటి టాప్ హీరో సరసన అవకాశం రావడంతో తెగ ఆనంద పడిపోతుంది. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ.. తొలి రోజు షూటింగ్ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియా పేజ్ లోపోస్ట్ చేసింది. ఫోటో తో పాటు ' అద్భుతాలు జరగబోతున్నాయ్.. పీకే 25 ఫస్ట్ డే షూటింగ్' అంటూ కామెంట్ చేసింది.
పవన్ సరసన కీర్తీ సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. హరీక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతుండగా తొలి షెడ్యూల్ ను ఓ భారీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు.