ప్రభాస్ ‌మూవీ.. కన్ఫర్మ్‌ చేసేసింది | Prabhas 20th Movie Confirmed by Pooja Hegde | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 12 2018 10:32 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

Prabhas 20th Movie Confirmed by Pooja Hegde - Sakshi

పూజా హెగ్డే... ప్రభాస్‌

సాక్షి, సినిమా : సాహో తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించబోయే చిత్రం ఏంటన్న దానిపై స్పష్టత వచ్చేసింది. జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ డైరెక్షన్‌లోనే ఈ చిత్రం ఉండబోతోంది. ఈ విషయాన్ని డస్కీ బ్యూటీ పూజా హెగ్డే వెల్లడించారు. 

అంతేకాదు తాను ఆ చిత్రంలో ప్రభాస్‌ సరసన తాను నటించబోతున్నట్లు పూజ తెలిపింది. రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌గా ఆ చిత్రం ఉండబోతుందని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మించబోయే ఈ చిత్రం ప్రభాస్‌ కెరీర్‌లో 20వది.  సమ్మర్‌ ఇది లాంఛ్‌​ అయ్యే అవకాశం ఉంది. 

ఇదిగాక పూజా.. ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ల చిత్రంతోపాటు మహేష్‌బాబు 25వ చిత్రంలోనూ నటించబోతోంది. మరోపక్క రంగస్థలంలోనూ ఐటెం సాంగ్‌లోనూ చెర్రీతో కలిసి చిందులు వేయబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement