Prabhas Periodic love story with Pooja Hegde - Sakshi
Sakshi News home page

ఫారిన్‌లో లవ్‌

Published Fri, Apr 27 2018 12:30 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

PRABHAS GEARS UP FOR A BILINGUAL PERIOD-ROMANCE WITH POOJA HEGDE - Sakshi

ప్రభాస్‌, పూజాహెగ్డే

ప్రేమించడానికి దాదాపు 40 ఏళ్లు వెనక్కి వెళ్లి మరీ ప్రభాస్‌ ప్రిపేర్‌ అవుతున్నారట. అది కూడా ఇండియాలో కాదు. యూరప్‌లో. లవ్‌ కోసం ప్రభాస్‌ ప్రిపేర్‌ అవ్వడం ఏంటీ అంటే... సినిమాలో క్యారెక్టర్‌ కోసం తప్పదుగా. ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా జూన్‌లో లాంఛనంగా ప్రారంభం అవుతుందట. జూలై ఫస్ట్‌ వీక్‌లో ప్రభాస్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని టాక్‌. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు డైరెక్టర్‌ రాధాకృష్ణ.

‘‘దర్శక–నిర్మాతలు హీరోయిన్‌ రోల్‌ కోసం నన్ను అప్రోచ్‌ అయినప్పుడు ప్రభాస్‌ హీరో అని నాకు తెలుసు. చాలా ఎగై్జట్‌ అయ్యాను. గుడ్‌ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీ మూవీ ఇది. సినిమాలో నా క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది’’ అని పూజాహెగ్డే పేర్కొన్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అంటే.. దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రేమలు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో చూడబోతున్నామన్నమాట. ఈ లవ్‌స్టోరీ తొలకరిలో స్టార్ట్‌ కానుందట. ‘సాహో’ షూటింగ్‌ కోసం ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు ప్రభాస్‌. సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement