సరికొత్త అవతారంలో ప్రభుదేవా | Prabhudheva turns producer | Sakshi
Sakshi News home page

సరికొత్త అవతారంలో ప్రభుదేవా

Published Fri, Jul 31 2015 4:02 PM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

సరికొత్త అవతారంలో ప్రభుదేవా

సరికొత్త అవతారంలో ప్రభుదేవా

నటుడిగా, నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా.. ఇలా ఇప్పటివరకు విభిన్న పాత్రలు పోషించిన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. ఇప్పుడు మరో సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. అవును.. ఆయన నిర్మాతగా మారబోతున్నారు. 'ప్రభుదేవా స్టూడియోస్' పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆయన.. తన తొలి సినిమా ఏదన్న విషయాన్ని ఆగస్టు 3వ తేదీన ప్రకటించబోతున్నారు.

ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవా.. తాను నిర్మాతగా తీయబోయే సినిమాలు కూడా అత్యున్నత విలువలతో కూడి ఉంటాయని చెబుతున్నారు. ఈ నిర్మాణ సంస్థలో అత్యున్నత అర్హతలు కలిగిన వృత్తినిపుణులు, అపార అనుభవం ఉన్నవాళ్లు ఉన్నారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement