Prabhudheva
-
నా సొంత పగ అంటున్న సల్మాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దబాంగ్ 3. ఇప్పటికే ఈ సీరిస్‌లో రెండు విజయవంతమైన చిత్రాలను సల్మాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దబాంగ్ 3కి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. మూడు నిమిషాలు సాగిన ఈ ట్రైలర్లో.. ప్రజెంట్, ప్లాష్‌బ్యాక్ పాత్రల్లో సల్మాన్ తనదైన నటనను కనబరిచారు. సోనాక్షి సల్మాన్ భార్యగా నటిస్తుండగా.. ప్లాష్‌బ్యాక్‌లో సయీ మంజ్రేకర్‌తో ఆయన ఆడిపాడనున్నారు. కామెడీతోపాటు, ఎమోషన్స్‌తో కూడిన ఈ ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చుల్బుల్ పాండేగా మరోసారి సల్మాన్ మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. దబాంగ్ మొదటి రెండు బాగాల్లో కనిపించిన అర్బాజ్‌ఖాన్, మహీగిల్ తమ పాత్రలను నిలుపుకోగా, కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిందీతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. ఇప్పటికే సల్మాన్‌కు వాంటెడ్(పోకిరి రీమేక్)తో విజయాన్ని అందించిన ప్రభుదేవా.. దబాంగ్ 3తో మరో హిట్‌ను అందిస్తారని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభుదేవా మరోసారి సల్మాన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కొరియన్ చిత్రం ‘ద అవుట్ లాస్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. -
చార్లీ చాప్లిన్2 సినిమా ఫొటో గ్యాలరీ
-
షోలే మాదిరి చేస్తానన్నారు
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్గ్రీన్ చిత్రం షోలే. ఆ చిత్రం మాదిరి మరో చిత్రాన్ని ఊహించగలమా? అయితే ఆ విధంగా కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రాన్ని చేస్తానని ఐసరి గణేశ్ విశాల్, కార్తీలకు మాట ఇచ్చారట. ఈ ఇద్దరు కథానాయకులతో రూపొందనున్న తాజా చిత్రం కరుప్పురాజా వెళ్లైరాజా. ఈయన భాగస్వామ్యంతో ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై ప్రభుదేవా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సంస్థలో నిర్మించిన తొలి చిత్రం దేవి, మలి చిత్రం బోగన్ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వినోదన్, సిల సమయంగళ్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా కరుప్పురాజా, వెళ్లైరాజా ఐదవ చిత్రంగా తెరకెక్కనుంది. హారీష్ జయరాజ్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సాయేషా కథానాయకిగా నటించనుంది. ఈ చిత్ర లోగో, టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నటి సయేషా సైగల్ మాట్లాడుతూ తాను ప్రస్తుతం నటిస్తున్న వనమగన్ చిత్రంలో ఒక పాటకు ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో డ్యాన్స్ చేయడంతో కల నిజమైనట్లు భావించానన్నారు. అలాంటిది తన రెండవ చిత్రాన్నే ఆయన దర్శకత్వంలో విశాల్, కార్తీలాంటి స్టార్ హీరోలతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్తీ మాట్లాడుతూ ఇద్దరు స్టార్ హీరోలతో ఒక చిత్రం చేయడం ఎలాంటి గందరగోళానికి దారి తీస్తుందో అందరికీ తెలిసిందేనన్నారు. ఆ హీరోలు మంచి స్నేహితులైతేనే సినిమా సాధ్యం అవుతుందన్నారు. ఇక నటుడు విశాల్ తన గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారన్నారు. యూనిక్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని ఆయనతో కలిసి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో తన పాత్ర హ్యూమరస్‌గా ఉంటుందని, విశాల్ పాత్ర వేరే లెవల్లో ఉంటుందని, అది ఆయన ఇంత వరకూ చేయనటువంటిదిగా ఉంటుందని అన్నారు. పూర్తి కాంట్సస్ట్ పాత్రల్లో తామిద్దరం నటించనున్నట్లు చెప్పారు. షోలే మాదిరి చేస్తానన్నారు నటుడు విశాల్ మాట్లాడుతూ ఇటీవల కన్నుమూసిన దర్శకుడు సుభాశ్ రాసిన కథ ఇదని అన్నారు. చాలా కాలం క్రితమే ఆయన ఈ కథను చెప్పారని, తనకు, కార్తీకి బాగా నచ్చడంతో చిత్రం చేయాలనుకున్నామని, నిర్మాత ఎవరన్న చర్చ వచ్చినప్పుడు ఐసరి గణేశ్ ఈ చిత్రాన్ని షోలే మాదిరి చేస్తాను ఆ విషయాన్ని తనకు వదిలేయండి అన్నారు. ఇక పోతే మల్టీటాలెంటెడ్ వ్యక్తి ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. తాను, కార్తీ కలిసి నడిగర్‌సంఘ భవన నిర్మాణానికి రూ.10 కోట్ల నిధి అందిస్తామని చెప్పామన్నారు. అది ఈ చిత్రం నుంచే మొదలవుతుందని విశాల్ చెప్పారు. హింస, అహింసకు మధ్య పోరాటం చిత్ర దర్శక, నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ హింస, అహింసకు మధ్య జరిగే పోరాటమే ఈ కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రం అని తెలిపారు. విశాల్, కార్తీ నటించడానికి ముందుకు రావడంతో ఈ చిత్రం సెట్‌కు వెళ్లనుందని పేర్కొన్నారు. -
'ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్'
ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి టుటక్ టుటక్ టుటియా సినిమాలో నటిస్తున్న సోనూసూద్, ప్రభుదేవా కామెడీ టైమింగ్, డైరెక్షన్ టాలెంట్ పై ప్రశంసలు కురిపించాడు. ' ఇప్పటికే ప్రభుదేవాతో కలిసి రెండు సినిమాల్లో నటించా.. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు. ఆయన కామెడీ టైమింగ్, డైరెక్షన్ టాలెంట్ అద్భుతం' అన్నాడు. ఈ సినిమాతో తొలి సారిగా నిర్మాతగా మారుతున్న సోనూసూద్ ప్రమోషన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక నిర్మాతగా ప్రేక్షకుడు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఇచ్చేందుకు కష్టపడ్డానని తెలియజేశాడు. తమన్నా లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 7న రిలీజ్ అవుతోంది. -
సరికొత్త అవతారంలో ప్రభుదేవా
నటుడిగా, నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా.. ఇలా ఇప్పటివరకు విభిన్న పాత్రలు పోషించిన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. ఇప్పుడు మరో సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. అవును.. ఆయన నిర్మాతగా మారబోతున్నారు. 'ప్రభుదేవా స్టూడియోస్' పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆయన.. తన తొలి సినిమా ఏదన్న విషయాన్ని ఆగస్టు 3వ తేదీన ప్రకటించబోతున్నారు. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవా.. తాను నిర్మాతగా తీయబోయే సినిమాలు కూడా అత్యున్నత విలువలతో కూడి ఉంటాయని చెబుతున్నారు. ఈ నిర్మాణ సంస్థలో అత్యున్నత అర్హతలు కలిగిన వృత్తినిపుణులు, అపార అనుభవం ఉన్నవాళ్లు ఉన్నారని అంటున్నారు. -
శ్రీహరికి కేన్సర్ లేదు, చనిపోయారంటే నమ్మలేకపోతున్నా: ప్రభుదేవా
టాలీవుడ్ నటుడు శ్రీహరి అకస్మికమరణాన్ని నమ్మలేకపోతున్నానని ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల ముందు కూడా ఆయన షూటింగ్లో పాల్గొన్నారని, ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉల్లాసంగా గడిపారని చెప్పారు. బుధవారం ముంబైలో హఠాన్మరణం చెందిన శ్రీహరి.. ప్రభుదేవా దర్శకత్వంలో 'ఆర్.. రాజ్‌కుమార్' సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారు. 'శ్రీహరి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకు ఉక్కు మనిషిగా పేరుంది. నేను పనిచేసిన అత్యంత ఆరోగ్యకరమైన, ఫిట్నెస్ ఉన్న నటుల్లో శ్రీహరి ఒకరు. ఆయనకు కేన్సర్ ఉన్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. ముంబైలో షూటింగ్లో పాల్గొన్నాక ఊహించనివిధంగా అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో చనిపోయారు' అని ప్రభుదేవా చెప్పారు. ఆయన హైదరాబాద్ వచ్చి శ్రీహరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.